ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..! ప్రశాంతంగా ఐదో విడత పోలింగ్..!!
హైదరాబాద్ : సార్వత్రిక సమరంలో భాగంగా జరుగుతోన్న ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వత్ సిన్హా, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు పలువురు ప్రముఖులు సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్..! క్యూ కడుతున్న ప్రముఖులు..!!
దేశంలోని 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 51 నియోజకవర్గాల్లో ఐదో దశ పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి, లఖ్‌నవూ బీజేపీ అభ్యర్థి రాజ్‌నాథ్ సింగ్ నగరంలోని పోలింగ్ బూత్ నెంబరు 333, స్కాలర్స్ హోమ్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నువ్వా నేనా అన్నట్టు ఎన్నికలు..!!
గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు..! నువ్వా నేనా అన్నట్టు ఎన్నికలు..!! అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, లఖ్‌నవూలో తన విజయం తథ్యమని.. మెజార్టీ ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఆయన సతీమణి గాయత్రితో కలిసి జైపూర్‌లో ఓటేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈసారి ఎన్నికలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

జాతీయ నేతల పోటీ..! బూతులకు తరలి వస్తున్న నాయకులు..!!
బీఎస్పీ అధినేత్రి మాయావతి లఖ్‌నవూలోని మొంటెస్సోరీ ఇంటర్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు..!!
కొనసాగుతున్న ఐదో విడత..! కట్టుదిట్టమైన ఏర్పాట్లు..!!
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆయన సతీమణి నీలిమా సిన్హాతో కలిసి ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుమారుడు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా హజారీబాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications