Maharastra Exit poll: మహారాష్ట్ర వార్ వన్ సైడే-తేల్చేసిన పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్..!
మహారాష్ట్రలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇవాళ జరిగిన పోరులో అధికార మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని ఈ కూటమి భారీ మెజార్టీతో గెలువబోతున్నట్లు తెలిపింది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోతోందని వెల్లడించింది.
అధికార మహాయుతి కూటమికి 175 నుంచి 196 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన యూబీటీతో కూడిన మహా వికాస్ అఘాడీకి కేవలం 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 113 సీట్లు, శివసేన షిండే వర్గానికి 52 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 17 సీట్లు వస్తాయని ఈ పోల్ అంచనా వేసింది. అలాగే మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ కు 35 సీట్లు, శరద్ పవార్ ఎన్సీపీకి 35 సీట్లు, ఉద్దవ్ సేనకు 27 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లకు జరిగిన ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి 47.8 శాతం నుంచి 51.4 శాతం ఓట్లు లభించబోతున్నాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అలాగే మహా వికాస్ అఘాడీ కూటమికి 38.5 శాతం నుంచి 42.6 శాతం ఓట్లు రాబోతున్నట్లు తేల్చేసింది. బీజేపీకి అత్యధికంగా 31.3 శాతం ఓట్లు లభించబోతున్నట్లు ఎగ్టిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications