Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Supreme Court :సుప్రీంకోర్టులో శాశ్వత రాజ్యాంగ బెంచ్ ఎప్పుడు ? కొత్త సవాళ్ల నేపథ్యంలో చర్చ..!

భారత దేశంలో సామాన్యుడి నుంచి దేశాన్ని నడుపుతున్న పెద్దల వరకూ ఇప్పుడు అందరి చూపూ సుప్రీంకోర్టుపైనే ఉంటుంది. అందులోనూ రాజ్యాంగ ధర్మాసనంపైనే ఉంటోంది. దీనికి ప్రధాన కారణం స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ రాజ్యాంగం అమలు విషయంలో అన్ని స్ధాయిల్లోనూ నెలకొంటున్న సంఘర్షణలే. వీటికి స్పందనగా రాజ్యాంగ నియమాలకు సరైన నిర్వచనం ఇస్తూ తప్పుడు అన్వయాలకు చెక్ పెట్టాలంటే రాజ్యాంగ ధర్మాసనాలే మందు. అదీ సుప్రీంకోర్టులో ఎప్పటికప్పుడు వీటి ఏర్పాటు కాకుండా ఓ శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటే మందుగా కనిపిస్తోంది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తాజాగా సుప్రీంకోర్టులో ఐదు, ఏడు, తొమ్మిది మంది న్యాయమూర్తులతో మూడు రాజ్యాంగ బెంచ్ లు ఏర్పాటు చేసారు. కానీ సుప్రీంకోర్టులో ఓ శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం మాత్రం లేదు. దీంతో ఎప్పటి నుంచో న్యాయసంస్కరణల్లో భాగంగా కీలక డిమాండ్ గా ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శాశ్వత బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడమూ ఇందుకు కారణమే.

permanent constitutional bench in Supreme Court, a need of the hour...

రాజ్యాంగం అంతర్-రాష్ట్ర, కేంద్ర-రాష్ట్ర వివాదాలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికార పరిధిని ఇస్తుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) చట్టపరంగా ఎదురయ్యే కఠిన సవాళ్లకు పరిష్కారం చూపేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనుమతిస్తోంది. ఇందులోనూ కనీసం ఐదుగురు న్యాయమూర్తులచే విచారణకు ఆదేశించేలా నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 142 కూడా పార్టీల మధ్య 'పూర్తి న్యాయం' చేయడానికి సుప్రీంకోర్టుకు ఒక ప్రత్యేక అధికారాన్ని అందిస్తుంది.

సుప్రీంకోర్టుతో పాటు ఇప్పటివరకూ అందులో ఏర్పాటవుతున్న రాజ్యాంగ ధర్మాసనాలు కూడా గతంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించాయి. అలాగే రాజ్యాంగ నిబంధనలకు సరైన అర్ధం చెప్పాయి. ఇవి ఆ తర్వాత వచ్చిన ఎన్నో కేసుల పరిష్కారంలో పనికొచ్చాయి కూడా. కానీ ఎప్పటికప్పుడు ఇలా సవాళ్లు ఎదురైనప్పుడు ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక రాజ్యాంగ ధర్మాసనాల కంటే ఓ శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఉంటే అది రెగ్యులర్ గా ఇలాంటి సమస్యలకు పరిష్కారం సూచించే అవకాశముంది.

శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అలాగే కొన్నేళ్లుగా సుప్రీంకోర్టులో పూర్తి స్ధాయిలో న్యాయమూర్తులు లేరు. కానీ ఈ మధ్యకాలంలో జడ్డీల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు 32 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారు. కాబట్టి శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి, న్యాయమూర్తులు రిటైర్ అయినప్పుడు వారి స్ధానాల్ని ఇతర రాజ్యాంగంపై పట్టు ఉన్న న్యాయమూర్తులతో భర్తీ చేస్తూ పోతే అది దేశానికి దశ,దిశ చూపుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, కుంభకోణాలు వంటి ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తే ప్రజా ప్రయోజన వాజ్యాల కోసం సుప్రీంకోర్టు ఎక్కువగా తమ సమయం వినియోగిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఈ పని నుండి న్యాయమూర్తులను తప్పించి వారిని ఎప్పటికప్పుడు రాజ్యాంగ ధర్మాసనంలో చేర్చడం ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే సుదీర్ఘ కాలానికి కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం అవసరంగా మారింది.

మరోవైపు ఈ ఏడాది జూలైలో న్యాయ శాఖ బయటపెట్టిన సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు పరిష్కరించిన కేసుల సంఖ్య తగ్గింది. రాజ్యాంగ ధర్మాసనాలు 1950-1959 మధ్యకాలంలో 440 కేసులు పరిష్కరిస్తే.. 1960-1969లో 956 కేసులను పరిష్కరించాయి. అదే 2010-2019లో 71 కేసులు, 2020-2023లో 19 కేసులు మాత్రమే పరిష్కరించి తీర్పులిచ్చాయి. ప్రస్తుతం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌ల ముందు 306 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా విచారించి తీర్పులివ్వాలంటే శాశ్వత బెంచ్ అవసరం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+