హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Petrol Price: మొహమాటాల్లేవ్: అటు కాంగ్రెస్ ధర్నా..ఇటు పెట్రో రేట్లు మళ్లీ పెంపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు ఏ మాత్రం పట్టువిడుపు ధోరణిని ప్రదర్శించట్లేదు. మొహమాటాల జోలికి అసలు వెళ్లదలచుకోలేదు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్‌ను దాటేసినప్పటికీ- వెనక్కి తగ్గట్లేదు. జనం నుంచి ఎదురవుతోన్న ప్రతిఘటనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవట్లేదు. తాజాగా మరోసారి ఇంధన రేట్లను పెంచేశాయి. ఫలితంగా- హైదరాబాద్‌లో పెట్రోల్ 100 రూపాయలను అందుకోవడానికి రెడీ అయిపోయింది.

Recommended Video

Petrol Diesel Price Hike : Vijayawada లో సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర ! || Oneindia Telugu

CJI NV Ramana: తిరుమల శ్రీవారిని దర్శించిన చీఫ్ జస్టిస్: దేవదేవుడి సేవలో కుటుంబంCJI NV Ramana: తిరుమల శ్రీవారిని దర్శించిన చీఫ్ జస్టిస్: దేవదేవుడి సేవలో కుటుంబం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శనివారం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 28 నుంచి 30 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.95.85, డీజిల్ 86.75 పైసలుగా రికార్డయింది. ఈ నెలలో ఇప్పటిదాకా పెట్రోల్‌ రూ.1.35 పైసలు, డీజిల్ రూ.1.39 పైసల మేర పెరిగినట్టయింది. ముంబైలో పెట్రోల్ రేటు 102 మార్క్‌ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.102.04 పలుకుతోంది. డీజిల్‌ ధర 94.15 పైసలకు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు నూటికి చేరువైంది. లీటర్ పెట్రోల్ రూ. 99.62 పైసలు పలుకుతోంది. డీజిల్ 94.57 రూపాయలకు చేరింది.

 Petrol and Diesel prices again hiked, Congress workers staged protests against rising fuel rates

చెన్నైలో పెట్రోల్ రూ. 96.19, డీజిల్‌ ధర రూ. 91.42, కోల్‌కతలో పెట్రోల్ రూ.95.80 పైసలు, డీజిల్‌ ధర రూ.89.60 పైసలు పలుకుతోంది. పుణేలో పెట్రోల్ రూ.101.64, డీజిల్ 92.32, బెంగళూరులో పెట్రోల్-99.05, డీజిల్-91.97, చండీగఢ్‌లో పెట్రోల్-92.19, డీజిల్-86.40, లక్నోలో పెట్రోల్-92.81, డీజిల్-86.87గా నమోదైంది. భోపాల్‌లో పెట్రోల్-103.75, డీజిల్-95.05 రూపాయలకు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర రికార్డు నెలకొల్పింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 106.64 రూపాయలకు చేరింది. డీజిల్ 99.50 పైసలు ఉంటోంది. జైపూర్‌లోనూ 102 రూపాయలను దాటేసింది పెట్రోల్ రేటు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఏపీ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో 102 రూపాయలకు పైగా దీని ధర చేరగా.. రత్నగిరి, పర్భణీ, ఔరంగాబాద్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, శ్రీగంగానగర్, బన్స్‌వారా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్, ఏపీలోని గుంటూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కర్ణాటకలోని చిక్‌మగళూరు, శివమొగ్గ, దావణగెరె వంటి చోట్ల వంద రూపాయలను దాటేసింది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నా
రోజూ పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఎన్‌ఎస్‌యూఐ వంటి అసోసియేషన్లు ఇందులో పాల్గొంటోన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. జట్కా బండ్లు, సైకిళ్లు ఎక్కి నిరసనలను తెలియజేస్తోన్నారు. కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభకర పరిస్థితుల్లోనూ మోడీ సర్కార్.. ప్రజలపై ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

English summary
Congress workers staged protests at different places across the country as part of the party's nationwide protest against rising fuel prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X