Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్కరోజే విశ్రాంతి.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పైపైకి: అక్కడ లీటర్ రూ.114 పైగా

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. వాటి రేట్లను పెంచే విషయంలో చమురు కంపెనీలు ఒక్కరోజు మాత్రమే విరామాన్ని ఇచ్చాయి. మంగళ, బుధ వారాల్లో వాటి రేట్లను పెంచాయి. గురువారం విశ్రాంతిని ఇచ్చాయి. ఇంధన ధరలను జోలికి వెళ్లలేదు. ఆ ఒక్క రోజు విరామం అనంతరం మళ్లీ ఇవ్వాళ వాటి రేట్లను సవరించాయి. నాలుగు రోజుల వ్యవధిలో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. ఫలితంగా- పలు నగరాల్లో పెట్రోల్ రేటు 110 రూపాయలను దాటింది.

మూడు రోజుల్లో రూ.2 పైగా..

మూడు రోజుల్లో రూ.2 పైగా..

పెట్రోల్, డీజిల్ ధరలను చమురుసంస్థలు తొలి రోజు లీటర్‌పై 80 పైసల మేర పెంచిన విషయం తెలిసిందే. రెండో రోజు కూడా అదే పెంపును కొనసాగించాయి. మళ్లీ లీటర్‌పై 80 పైసలను పెంచాయి. ఇప్పుడు కూడా మళ్లీ 80 పైసల మేర పెంచాయి. నాలుగు రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై అదనంగా పడిన భారం రూ. 2.40 పైసలు. 137 రోజుల సుదీర్ఘ విరామానికి బ్రేక్ ఇచ్చిన చమురు సంస్థలు.. అప్పుడు నెలకొన్న లోటును ఇప్పుడు భర్తీ చేసుకునేలా కనిపిస్తోన్నాయా? అన్నట్లు చమురు సంస్థలు వ్యవహరిస్తోన్నాయి.

వివిధ నగరాల్లో ఇలా..

వివిధ నగరాల్లో ఇలా..

పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.97.81 పైసలకు చేరింది. డీజిల్ రూ.89.07 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ112.51 పైసలు, డీజిల్ రూ.96.70 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.107.18 పైసలు, డీజిల్ రూ.92.22 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.103.67 పైసలు, డీజిల్ 93.71 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ.103.11 పైసలు, డీజిల్ రూ.87.37 పైసలుగా ఉంటోంది. భోపాల్‌లో పెట్రోల్ రేటు రూ.109.85 పైసలు, డీజిల్ 93.3572 పైసలు.

అక్కడ 114

అక్కడ 114


గ్రేటర్ నోయిడాలో పెట్రోల్ రూ.97.90 పైసలు, డీజిల్ రూ.89.43 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రేటు రూ.97.67 పైసలు, డీజిల్ 89.22 పైసలకు చేరింది. చండీగఢ్‌లో పెట్రోల్ రూ.96.59 పైసలు, డీజిల్ రూ.83.12 పైసలు పలుకుతోంది. జైపూర్‌లో పెట్రోల్ రూ.109.73 పైసలు, డీజిల్ రూ.93.91 పైసలకు పెరిగింది. అజ్మీర్‌లో పెట్రోల్ రూ.109.41 పైసలు, డీజిల్ రూ.92.91 పైసలు, బికనేర్‌లో పెట్రోల్ రూ.112.50, డీజిల్ 95.71 రూపాయలకు చేరింది. అత్యధికంగా శ్రీగంగానగర్‌లో పెట్రోల్ లీటర్ 114.02 పైసలు పలుకుతోంది. డీజిల్ రేటు రూ.97.08గా నమోదైంది.

యుద్ధం ఎఫెక్ట్..

యుద్ధం ఎఫెక్ట్..


అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర విపరీతంగా పెరిగిపోవడం వల్లే చమురు సంస్థలు ఆ భారాన్ని వాహనదారులపై మోపాయి. యుద్ధం ఆరంభమైన 40 శాతం క్రూడాయిల్ ధర పైకి ఎగబాకింది. యుద్ధం ఆరంభం కావడానికి ముందు రోజులతో పోల్చుకుంటే- ఈ రేటూ చాలా ఎక్కువ. పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం భారత్‌పైనా పడింది. ఫలితంగా నాలుగు రోజుల్లో మూడోసారి ఇంధన రేట్లను పెంచాల్సి వచ్చినట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగడం దాదాపు అసాధ్యమే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+