చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Petrol: ఆర్థిక పరిస్థితి పరిశీలించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాము, క్లారిటీ ఇచ్చిన సీఎం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పెట్రోల్, డీజిన్ ధరల మీద పన్ను భారం తగ్గించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు.

కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల మీద విధించిన పన్నును తగ్గించిందని, ఆ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మనవి చేశారు. కర్ణాటక ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకుంటున్నదని, అందుకే పెట్రోల్ డీజిల్ ధరల మీద రాష్ట్ర ప్రభుత్వాలు విదిస్తున్న పన్నును తగ్గించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Petrol: Based on economic status govt will decide tax reduction on fuel, says Karnataka CM in Bengaluru.

ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్సరెన్స్ లో మాట్లాడిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో 2021 నవంబర్ నెలలో పెట్రోల్, డీజిల్ మీద విధించిన పన్నును మా ప్రభుత్వం తగ్గించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ గుర్తు చేశారు.

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు పరిశీలించిన తరువాత మరోసారి పెట్రలో, డీజిల్ ధరలు తగ్గించే విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. త్వరలో మరోసారి కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని బీజేపీ సీనియర్ నాయకులు కొందరు క్లూ ఇచ్చారు.

English summary
Petrol: Based on economic status govt will decide tax reduction on fuel, says Karnataka Cm in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X