మరికాస్త ఉపశమనం: ఐదో రోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత నెలరోజులకుపైగా వరుసగా పెరిగిన పెట్రో ధరలు ఐదు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కాస్త దిగిరావడంతో వరుసగా ఐదో రోజూ దేశంలో ఇంధన ధరలు తగ్గాయి. దీంతో వినియోగదారుడికి మరికాస్త ఊరట లభించినట్లయింది.
దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 30పైసలు తగ్గి రూ. 81.34గా ఉంది. డీజిల్ కూడా 27పైసలు తగ్గి లీటర్ ధర రూ. 74.92గా ఉంది. ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో కూడా ఇంధన ధరలు కాస్త తగ్గాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 30పైసలు తగ్గి రూ.86.91గా ఉంది. డీజిల్ ధర 28పైసలు తగ్గి రూ.78.54గా ఉంది.

అక్టోబర్ 4న ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.91.34కు చేరిన విషయం తెలిసిందే. గత ఐదు రోజుల్లో పెట్రోల్‌పై రూ.1.39పైసలు, డీజిల్‌పై 80పైసల వరకు తగ్గింది. అక్టోబర్ 5వ తేదీన ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరపై రూ.2.50 వరకూ తగ్గింపు లభించింది.
-
వాహనదారుల మెడపై పెట్రోల్ కత్తి -
వాహనదారులపై మరో బాదుడు గ్యారెంటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications