పెట్రో మంట: ముంబైలో 95కి చేరిన లీటర్ పెట్రోల్.. వరసగా ఐదో రోజు పెంపు
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరసగా ఐదోరోజు ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.88.44కి చేరింది. డీజిల్ ధర రూ.36 పైసలు పెరిగి రూ.78.74 వద్ద స్థిరపడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రో ధర ఆల్ టైం హైకి చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.94.93కి చేరింది. ముంబైలో డీజిల్ ధర రూ.88.70కి వద్ద స్థిరపడింది.

ఇటు చెన్నైలో పెట్రోల్ ధర రూ.90.70 కాగా.. డీజిల్ ధర రూ.83.86గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ 89.73, డీజిల్ ధర రూ.82.33గా ఉంది. ఐటీ హబ్ బెంగళూరులో పెట్రోల్ రూ.91.40, డీజిల్ రూ.83.47గా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు పెట్రోలు ధరలను సడలిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరను బట్టి మార్పు చేర్పులు ఉంటాయి. దేశంలో వ్యాట్, ఇతర పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రో ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ధరల వాత ఏంటీ అని మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications