Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్క రోజే ఊరట: మళ్లీ బాదుడు షురూ: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.114 ప్లస్

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఒక్కరోజు విరామం తరువాత చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయల మార్క్‌ను దాటేసింది. ఒకట్రెండు చోట్ల 114 రూపాయలను దాటేసింది.

పెట్రోల్, డీజిల్‌పై ఎంత పెరిగిందంటే..

పెట్రోల్, డీజిల్‌పై ఎంత పెరిగిందంటే..

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల మేర పెంపుదల కనిపించింది. ఇదే పెరుగుదల అన్ని ఆయిల్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. తాజాగా పెంపుతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 110 రూపాయలను దాటింది. ఈ మార్క్‌ను అందుకున్న నగరాల సంఖ్య ఇదివరకు చాలా పరిమితంగా ఉండేది. ఇప్పడు పరిస్థితి మారింది.

చెన్నైలో కూడా వందకు పైగా

చెన్నైలో కూడా వందకు పైగా

తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.102.64 పైసలకు చేరింది. డీజిల్ 91.07 పైసలుగా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.108.67 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్‌ ధర 98.80 పైసలు. చెన్నైలో పెట్రోల్ రూ.100.23 పైసలు, డీజిల్‌ ధర రూ.95.59 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది. వరుసగా పెంచుతోన్న ధరల వల్ల ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. ఇదివరకు దక్షిణాది రాష్ట్రాల రాజధానులతో పోల్చుకుంటే చెన్నైలోనే దాని ధర తక్కువగా ఉండేది.

హైదరాబాద్‌లో

హైదరాబాద్‌లో


కాగా- తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.103.36 పైసలుగా నమోదైంది. డీజిల్‌ ధర రూ.94.17గా ఉంటోంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.106.21, డీజిల్ రూ.96.66 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.99.54 పైసలు, డీజిల్ రూ.90.33 పైసలకు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.106.77 పైసలు, డీజిల్-99.37 పైసలు పలుకుతోంది. గువాహటిలో పెట్రోల్ రూ.98.58 పైసలు, డీజిల్ రూ.90.61 పైసలుగా రికార్డయింది. గాంధీనగర్‌లో పెట్రోల్ రూ.99.59 పైసలు, డీజిల్ రూ.98.27 పైసలు, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.104.89 పైసలు, డీజిల్ రూ.98.06 పైసలకు చేరింది.

ఇతర నగరాల్లో..

ఇతర నగరాల్లో..

పాట్నాలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.30 పైసలు, డీజిల్ 97.99 పైసలకు చేరింది. పుణేలో పెట్రోల్ రూ.108.22 పైసలు, డీజిల్ 96.85 పైసలు, నోయిడాలో పెట్రోల్ రూ.99.94 పైసలు, డీజిల్ 91.68 పైసలు పలుకుతోంది. పంజాబ్‌లోని మొహాలీలో పెట్రోల్ రూ.104.81 పైసలు, డీజిల్ 94.18 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.98.80 పైసలు, డీజిల్ 90.80 పైసలు, గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.100.37 పైసలు, డీజిల్ 91.79 పైసలుగా నమోదైంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 114 రూపాయలను దాటింది. శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ 114.51 పైసలు పలుకుతోంది.

 ఇప్పట్లో ఆగేది కష్టమే..

ఇప్పట్లో ఆగేది కష్టమే..


ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడితో ఆగలేనూ కనిపించట్లేదు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. ఈ నెల ఆరంభంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల- మున్ముందు మరిన్ని వాతలు ఉంటాయనే సంకేతాన్ని చమురు కంపెనీలు ఇవ్వకనే ఇచ్చినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలను సవరించాల్సి వచ్చిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+