ఆయిల్ కంపెనీల దండయాత్ర మళ్లీ మొదటికి: పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంతపెరిగాయంటే

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు కొంత విరామం తరువాత మళ్లీ దండయాత్రను మొదలు పెట్టాయి. వాహనదారులపై భారాన్ని మోపుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా ఇంధన ధరలను అమాంతం పెంచేశాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై అదనపు భారం పడుతూనే ఉంది. ఇదవరకు వరుసగా రెండు నెలల పాటు ఇంధన ధరలను పెంచినట్టే.. ఈ సారి కూడా అలాంటి చర్యలను తీసుకుంటాయనే ఇందోళన వాహనదారుల్లో నెలకొంది.

పెట్రో రేట్ల పెంపుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు ఇదివరకు నిరసన ప్రదర్శనలకు దిగిన విషయం తెలిసిందే. చమురు కంపెనీలు వాటిని ఏ మాత్రం పట్టించుకోవట్లేదనేది మరోసారి రుజువైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌‌పై 19 నుంచి 25 పైసలు, డీజిల్‌పై 24 నుంచి 27 పైసల మేర పెంపుదల కనిపించింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.101.39 పైసలకు చేరింది. డీజిల్ 89.57 పైసలుగా నమోదైంది.

 Petrol, diesel prices on September 28 2021: Fuel prices have been again hiked, Check rates here

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 107 రూపాయలను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.107.47 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్‌ ధర 97.21. చెన్నైలో పెట్రోల్ రూ.99.15, డీజిల్‌ ధర రూ.94.17 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించిన విషయం తెలిసిందే. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల రాజధానులతో పోల్చుకుంటే చెన్నైలోనే దాని ధర తక్కువగా ఉంటోంది.

కాగా- తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.101.87 పైసలుగా నమోదైంది. డీజిల్‌ ధర రూ.92.62గా ఉంటోంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.104.92, డీజిల్ రూ.95.06 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.98.51 పైసలు, డీజిల్ రూ.89.98 పైసలకు చేరింది. పాట్నాలో పెట్రోల్ రూ.104.04 పైసలు, డీజిల్ రూ.95.70, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.97.61, డీజిల్-89.31 పైసలు పలుకుతోంది. భోపాల్‌లో పెట్రోల్ రూ.109.85 పైసలు, డీజిల్ రూ.98.45 పైసలుగా రికార్డయింది.

హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.48, డీజిల్ రూ.97.74 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ రూ.103.63 పైసలు, డీజిల్ రూ.96.40 పైసలు, గాంధీనగర్‌లో పెట్రోల్ రూ.98.46 పైసలు, డీజిల్ రూ.96.74 పైసలు, గువాహటిలో పెట్రోల్ రూ.97.26 పైసలు, డీజిల్ రూ.88.98 పైసలకు చేరింది. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలను సవరించాల్సి వచ్చిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+