వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పెరిగిన ముడి చమురు ధర, లీటర్ పెట్రోల్ రూ.80పైనే, మరింత పైపైకి?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు దరలు ఒక్క రోజే 0.96 శాతం పెరిగాయి.దీంతో దేశీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో బ్యారెల్ ధర రూ. 4084 చేరుకొంది. ఇటీవల కాలంలో చమురు బ్యారెల్ ధర ఇంత ధరకు పలకడం ఇదే తొలిసారి.

దీంతో దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనావేస్తున్నారు మరో వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల భారం వినియోగదారులపై తీవ్రంగా పడే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒక్క రోజునే 0.96 శాతం పెరిగిన ముడి చమురు ధర

ఒక్క రోజునే 0.96 శాతం పెరిగిన ముడి చమురు ధర

అంతర్జాతీయ మార్కెట్లో 0.96 శాతం ముడి చమురు పెరిగింది. దీంతో ప్రస్తుతం బ్యారెల్ ధర రూ.4084కు చేరుకొంది దీంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ముంబైలో రూ.80లకు పెట్రోల్ ధరలు పెరిగాయి. హైద్రాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.76 దాటింది.రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

 పెట్రోల్ ఉత్పత్తి తగ్గడమే కారణం

పెట్రోల్ ఉత్పత్తి తగ్గడమే కారణం

ఒపెక్ సభ్య దేశాలు ఉత్పత్తిని నిదానంగా తగ్గిస్తుండటం కూడా క్రూడాయిల్ ధరలు పెరిగేందుకు దోహదపడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ లో ఫిబ్రవరిలో డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర బ్యారెల్ కు రూ. 39 పెరిగి, రూ. 4,084కు చేరిందని చెబుతున్నారు.

 ఆయిల్ పై ప్రభావం

ఆయిల్ పై ప్రభావం

నాణ్యత అధికంగా ఉండే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.55 శాతం పెరిగింది.ఇదే సమయంలో వరల్డ్ స్టాక్ మార్కెట్లు వృద్ధి బాటలో ఉండటం, ఆర్థికాభివృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి వెలువరించిన గణాంకాలు ఆయిల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచుతున్నాయి.

 పన్నుల భారం

పన్నుల భారం

పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం మోపుతున్నాయి. ఆదాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను వేస్తున్నాయి. ఈ పన్నుల భారాన్ని తగ్గించాలని రెండు మాసాల క్రితం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సూచించింది. మరో వైపు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ కూడ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడ ఈ దిశగా ఆలోచిస్తోంది.

English summary
Petrol prices in the city increased to Rs 80.06 a litre and diesel rose to Rs 66.04 a litre on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X