వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: పెట్రో ధరల వాత.. గర్ల్ ఫ్రెండ్‌ను కలువని స్థితిలో లవర్, సాంగ్ పాడటంతో వైరల్..

|
Google Oneindia TeluguNews

5 రాష్ట్రాల ఎన్నికల ముగిశాయి.. రష్యా- ఉక్రెయిన్ యుద్దం కొనసాగుతోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పెరుగుతోంది.. దీంతో పెట్రో ధరలకు రెక్కలు వచ్చాయి. చమురు సంస్థలు రోజు పెట్రో వడ్డన చేస్తున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. పెట్రో ధరలపై సోషల్ మీడియాలో రకరకాల మీట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఓ లవర్ ఏకంగా పాట పాడేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

పాట పాడిన లవర్..


పెట్రో ధరలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. జోక్స్వేస్తున్నారు. అయితే ఓ లవర్ పాట పాడారు. పెట్రో ధరల పెంపు వల్ల తాను బయటకు వెళ్లలేకపోతున్నానని చెప్పారు. అతని లవర్‌తో మాట్లాడిన వాయిస్ ఉంటుంది. ఆ తర్వాతే అతను పాట అందుకున్నాడు. పెట్రో ధరల పెంపుతో బయటకు రాలేకపోతున్నానని చెబుతాడు. ఆ వీడియోను ఈ నెల 6వ తేదీన మగాది బాయ్స్ పేరుతో పేజీలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

12 వేల లైకులు

12 వేల లైకులు

ఆ వీడియో 3.55 నిమిషాలు ఉంది. దానికి ఇప్పటివరకు 12 వేల లైకులు వచ్చాయి. 505 మంది కామెంట్ చేశారు. అతని గీతాలను చాలా మంది నెటిజన్లు ప్రశంసించారు. మరికొందరు ఈ పాట ప్రభుత్వానికి చేరుతుందని కామెంట్ చేశారు. నిజానికి ఆ ప్రేమికుడు చెప్పింది.. అక్షరాలా నిజం.. ఎందుకంటే పెట్రో ధరల పెరుగుదలతో జనం ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప.. బయటకు రావడం లేదు.

వరసగా హై

వరసగా హై

పెట్రో ధరలు వరసగా పెరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన పెట్రోల్‌పై 80 పైసలు చొప్పున డీజిల్2పై కూడా పెరిగింది. గత 16 రోజుల్లో లీటర్‌కు రూ.10 చొన్పున పెరిగాయి. మార్చి 22వ తేదీ నుంచి 14వ సారి పెట్రో ధర పెరిగాయి. ఇప్పటికే అన్నీ ముఖ్య నగరాల్లో పెట్రో ధర రూ.100 దాటింది. డీజిల్ ధర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గడ్, తెంగాణ, మధ్యప్రదేశ్, బీహర్, జార్ఖండ్, తమిళనాడు, కేరళలో కూడా వంద దాటాయి. మహారాష్ట్ర పర్భానిలో లీటర్ పెట్రోల్ దర రూ.123.6 ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో లీటర్ డీజిల్ రూ.107.61గా ఉంది.

English summary
A video song is now going viral on Facebook where a boyfriend is describing his pain of not being able to visit his girlfriend because of a hike in petrol rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X