ఏడోసారి పెరిగాయి: పెరిగిన పెట్రోల్ ధర, తగ్గిన డీజిల్ ధర
పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోలు లీటర్ పైన రూ.0.13 పైసలు, డీజిల్ పైన లీటరుకు 0.12 పైసలు పెరిగాయి. ఈ రోజు రాత్రి (బుధవారం) నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగగా, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోలు లీటర్ పైన రూ.0.13 పైసలు పెరిగింది. డీజిల్ పైన లీటరుకు 0.12 పైసలు తగ్గాయి. ఈ రోజు రాత్రి (బుధవారం) నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్ నెల నుంచి ఇది ఏడో దపా పెరుగుదల.

కాగా, నవంబర్ 15వ తేదీన పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. అప్పుడు పెట్రోల్‌పై లీటరుకు రూ.1.46 పైసలు, డీజిల్ పైన లీటరుకు రూ.1.53 పైసలు తగ్గించారు. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు అప్పుడు అదే రోజు (మంగళవారం) అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
అంతకుముందు, నవంబర్ 5వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సెప్టెంబర్ నుంచి అప్పుడు ధరలు పెరగడం ఆరోసారి. అప్పుడు పెట్రోల్ ధరలు లీటరుకు 89 పైసలు పెరగగా, డీజిల్ లీటర్ 86 పైసలు పెరిగాయి. ఇప్పుడు మాత్రం మొత్తంగా సెప్టెంబర్ నుంచి ఏడోసారి పెరిగాయి.












Click it and Unblock the Notifications