దేవుడా.. ముంబైలో మళ్లీ రూ.80 దాటిన పెట్రోల్, డీజిల్ రూ.68 పైనే!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గరిష్ట స్థాయిల్లో ఈ ధరలు సోమవారం నమోదయ్యాయి. సోమవారం లీటరు పెట్రోల్ ధర 15 పైసలు, లీటరు డీజిల్ ధర 7 పైసలు పెరిగింది.
దీంతో ముంబైలో పెట్రోల్ ధర మరోసారి రూ.80 మార్కును అధిగమించి, రూ.81.17గా నమోదవుతోంది. డీజిల్ రూ.68.30గా ఉంది. ముంబైలో స్థానిక పన్ను లేదా వ్యాట్ రేట్లు అత్యధికంగా ఉండటంతో అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి.

ఇక ఢిల్లీలో 2014 మార్చి నుంచి అత్యంత గరిష్ట స్థాయిల్లోకి పెట్రోల్ ధర ఎగిసింది. సోమవారం లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.73.31గా, డీజిల్ ధర రూ.64.14గా రికార్డయ్యాయి.
డిసెంబర్ మధ్య నుంచి లీటరు పెట్రోల్ ధర కనీసం రూ.4, డీజిల్ ధర రూ.5.77 మేర పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో వీటిపై రెండు రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. కానీ స్థానిక పన్నుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో, ధరలు పైకి ఎగుస్తూనే ఉన్నాయి.
రెండు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 8 రూపాయల మేర రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను విధించింది. ఒకవైపు అంతర్జాతీయ ముడిచమురు ధరలు ప్రస్తుతం తగ్గుతున్నా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు.












Click it and Unblock the Notifications