• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం నిర్ణయంతో అలజడి - భద్రత కట్టుదిట్టం - సమస్యాత్మక ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఊహించినట్టే- పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై నిషేధం వేటు పడింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యకలాపాలన్నింటినీ నిషేధించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిషేధం అయిదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ప్రధాని మోదీ తన జపాన్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే- పీఎఫ్ఐ నిషేధంపై హోం మంత్రిత్వ శాఖ తుది నిర్ణయాన్ని తీసుకుంది.

ఉగ్రవాద చర్యలుగా..

ఉగ్రవాద చర్యలుగా..

పీఎఫ్ఐ- దాని అనుబంధ అసోసియేషన్లపై నిషేధాన్ని వర్తింపజేసింది కేంద్రం. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద వాటిపై నిషేధాన్ని విధించినట్లు తెలిపింది. పీఎఫ్ఐ బ్యానర్ కింద ఇకపై ఎలాంటి చర్యలు చేపట్టినా అవన్నీ చట్ట విరుద్ధమే అవుతాయి. అలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిని పోలీసులు యూఏపీఏ కింద అరెస్ట్ చేస్తారు. ఉగ్రవాద, అవాంఛనీయ సంఘటన నివారణ కింద కఠిన చర్యలు తీసుకుంటారు.

 నిషేధించిన సంస్థలివే..

నిషేధించిన సంస్థలివే..

పీఎఫ్ఐతో రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ అండ్ రిహాబ్ ఫౌండేషన్, దాని అనుబంధ సంఘాలపై కేంద్రం నిషేధం విధించింది. గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని, ఈ సంస్థకు చెందిన కొందరు కార్యకర్తలు ఐసిస్‌లో కూడా చేరారంటూ హోం మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.

కర్ణాటకలో ఉద్రిక్తత..

కర్ణాటకలో ఉద్రిక్తత..


కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే- పలు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఎఫ్ఐ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో అలజడి చెలరేగింది. బెంగళూరు, హుబ్బళ్లి, కలబురగి, బెళగావి, బీదర్, చిక్‌బళ్లాపుర, రాయచూర్, రామనగర, మంగళూరు, హసన్, చిత్రదుర్గ, శివమొగ్గ, దక్షిణ కన్నడ, కోలార్, చామరాజనగర, దావణగెరె, కొప్పల్.. వంటి పలు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భద్రత కట్టుదిట్టం..

భద్రత కట్టుదిట్టం..

ఆయా నగరాలన్నింట్లోనూ పీఎఫ్ఐ కార్యకర్తలను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఇదివరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అయిదేళ్ల పాటు నిషేధం సైతం విధించిన నేపథ్యంలో - ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కర్ణాటక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేసింది. కేరళలో సరిహద్దు జిల్లాలపై నిఘా ఉంచింది.

స్వాగతించిన సీఎం..

స్వాగతించిన సీఎం..


పీఎఫ్ఐ నిషేధాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర స్వాగతించారు. సుధీర్ఘకాలం పాటు ఉన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా పలు ప్రతిపక్ష పార్టీలు కూడా పీఎఫ్ఐని నిషేధించాలంటూ డిమాండ్ చేస్తోన్నాయని చెప్పారు. సకాలంలో కేంద్రం సరైన నిర్ణయాన్ని తీసుకుందని బొమ్మై చెప్పారు. నిషేధానంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

English summary
Centre has banned the Popular Front of India declaring the outfit and all its associates, affiliates and fronts as UAPA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X