• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీపై దాడికి పీఎఫ్ఐ కుట్ర: ఉగ్రమూకకు శిక్షణ: షాకింగ్ విషయం వెల్లడించిన ఈడీ!!

|
Google Oneindia TeluguNews

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై దాడి చేయడానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర చేసిందని ఈడీ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై దాడికి ప్రయత్నం చేసిందని, దీని కోసం కొంత మందికి శిక్షణ ఇచ్చిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.

ప్రధాని మోడీతో పాటు యూపీలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర

ప్రధాని మోడీతో పాటు యూపీలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర

ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీపై పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) దాడికి పాల్పడడానికి, ఉత్తరప్రదేశ్లో టెర్రర్‌ మాడ్యూళ్లను తయారుచేయడానికి, మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో దాడులు చేయడానికి రెడీ అయిందని పేర్కొన్నారు. ఏకకాలంలో ఉత్తరప్రదేశ్‌లోని సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై దాడులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సిద్ధమయ్యిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. జులై 12న ప్రధాని మోదీ పాట్నా పర్యటన సందర్భంగా దాడి చేసేందుకు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసిందని కేరళలో గురువారం అరెస్టు చేసిన పీఎఫ్‌ఐ సభ్యుడు షఫీక్ పాయెత్‌పై ఈడీ తన రిమాండ్ నోట్‌లో పేర్కొంది.

 దేశవ్యాప్తంగా అల్లర్లు, ఉగ్రవాద కార్యాకలాపాల కోసం నిధులు

దేశవ్యాప్తంగా అల్లర్లు, ఉగ్రవాద కార్యాకలాపాల కోసం నిధులు

ఈ సంస్థ కొన్నేళ్లుగా రూ.120 కోట్ల విరాళాలను సేకరించినట్టు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఎక్కువగా నగదు రూపంలో సేకరించిన ఈ వివరాలు దేశవ్యాప్తంగా అల్లర్లు మరియు ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉద్దేశించబడిందని వెల్లడించింది. గురువారం దేశవ్యాప్త దాడులను నిర్వహించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సహా అనేక ఏజెన్సీలు దేశవ్యాప్తంగా పిఎఫ్ఐ తో సంబంధం ఉన్న వంద మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడి ఈ దాడులకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది.

పాపులర్ ఫ్రంట్ కార్యాకలాపాలపై మనీ ల్యాండరింగ్ కేసు

పాపులర్ ఫ్రంట్ కార్యాకలాపాలపై మనీ ల్యాండరింగ్ కేసు

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ డైరెక్టర్ల బోర్డులోని మరో ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పర్వేజ్ అహ్మద్, మహమ్మద్. ఇలియాస్ మరియు అబ్దుల్ ముఖీత్ నుండి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2018 నుండి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించినప్పుడు, వారందరినీ ఏజెన్సీ అనేకసార్లు ప్రశ్నించింది. గతంలో ఖతార్‌లో నివసించిన పాయత్, దేశంలో అంతరాయం కలిగించడానికి విదేశాల నుండి డబ్బును పిఎఫ్‌ఐకి బదిలీ చేయడానికి భారతదేశంలోని తన ఎన్‌ఆర్‌ఐ ఖాతాను అక్రమంగా ఉపయోగించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు.. దారి మళ్లించిన పీఎఫ్ఐ

రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు.. దారి మళ్లించిన పీఎఫ్ఐ

రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో పెట్టుబడులు మరియు వాటిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి మళ్లించినట్లు వెల్లడైన క్రమంలో పాయత్ యొక్క ఇల్లు, సంస్థలపై గతంలో ఏజెన్సీ దాడులు చేసింది. దేశంలోని మరియు విదేశాలలో తెలియని, అనుమానాస్పద మూలాల నుండి చాలా ఎక్కువ భాగం నగదు రూపంలో జమ చేయబడింది అని ఏజెన్సీ తెలిపింది. ఈ నిధులు కాలక్రమేణా వారి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ఉపయోగం కోసం బదిలీ చేయబడ్డాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇందులో హింసను ప్రేరేపించడం మరియు ఫిబ్రవరి 2020 నాటి ఢిల్లీ అల్లర్లకు దారితీసే ఇబ్బందులను ప్రేరేపించడం, హత్రాస్‌కు పిఎఫ్ఐ సభ్యుల సందర్శన వంటివి ఉన్నాయి.

ఉగ్రదాడులకు కుట్రల నేపధ్యంలోనే పీఎఫ్ఐ పై దాడులు

ఉగ్రదాడులకు కుట్రల నేపధ్యంలోనే పీఎఫ్ఐ పై దాడులు

మత సామరస్యానికి భంగం కలిగించడం, అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, ఉగ్ర గ్యాంగ్‌గా ఏర్పడి, యూపీలోని ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో యూపీలోని ముఖ్యమైన, సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై ఏకకాలంలో దాడులకు కుట్ర చేసిందని పేర్కొంది. దేశ ఐక్యత, సమగ్రత మరియు సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే సంభావ్య కార్యకలాపాలను కూడా ఆ సంస్థ ఆరోపించింది. విచారణ సమయంలో, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు దాని సభ్యుల వివిధ బ్యాంకు ఖాతాలను విశ్లేషించారు. ఇదే సమయంలో నిందితుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

English summary
The Enforcement Directorate has revealed a shocking fact that PFI had conspired to attack Prime Minister Modi and trained terrorists for riots and attacks in UP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X