PhonePe: కాంగ్రెస్‍ను హెచ్చరించిన ఫోన్ పే.. ఎందుకంటే..!
మధ్యప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పోస్టర్ యుద్ధానికి తెరలేపాయి. కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్ లో కూడా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ టార్గెట్ గా కాంగ్రెస్ పోస్ట్ వార్ కు దిగింది. అయితే కాంగ్రెస్ ముద్రించిన పోస్టర్లపై యూపీఐ పేమెంట్స్ యాప్ ఫోన్ పే అభ్యంతరం వ్యక్తం చేసింది. పోస్టర్లపై తమ లోగో వాడడంపై సీరియస్ అయింది.
ఫోన్ పే తన పేరు, లోగోను ఉపయోగించడాన్ని వ్యతిరేకించింది. ఈ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ హెచ్చరించింది. కాంగ్రెస్ ముద్రించిన పోస్టర్‌లలో ముఖ్యమంత్రి ముఖంతో కూడిన క్యూఆర్ కోడ్ ఉంది. రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా 50 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. అలాగే ఫోన్ లోగ్ ను కూడా ముద్రించారు.

ఈ పోస్టర్లను భోపాల్, ఇండోర్, గ్వాలియర్, సెహోర్, రేవా, మందసౌర్, ఉజ్జయిని, భింద్, బాలాఘాట్, బుధ్ని, మరికొన్ని నగరాల్లో అంటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. దీనిపై సోమవారం, ఫోన్‌పే ట్విట్టర్ వేదికగా స్పందించింది. "మా బ్రాండ్ లోగో దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నాం. తమకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఫోన్ పే లోగో తమ సంస్థకు చెందిన రిజిస్టర్ ట్రేడ్ మార్క్. దయచేసి పోస్టర్లు, బ్యానర్ల నుంచి తమ లోగోను తొలగించగలరు" అంటూ ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా ఇలాంటి ప్రణాళికనే అనుసరించింది. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమీషన్ సర్కార్ అంటూ పోస్టర్లు ముద్రించింది. ఇది బాగా పని చేసి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు స్ట్రాటజీని మధ్యప్రదేశ్ లో అమలు చేస్తోంది. ఫోన్ పే హెచ్చరికపై ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు ఎవరూ స్పందించలేదు.












Click it and Unblock the Notifications