బిగ్ స్కాండల్: సుప్రీంకోర్టు జడ్జి, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్: యాపిల్

న్యూఢిల్లీ: దేశంలో బిగ్ హ్యాకింగ్ స్కాండల్ చోటు చేసుకుంది. పలువురు వేర్వేరు రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. బాధితుల జాబితాలో కొందరు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. జర్నలిస్టుల ఫ్లోనూ వదల్లేదు హ్యాకర్లు. మొత్తంగా 300 మందికి బాధితులు ఉన్నారు. ఈ జాబితాలో దేశ అత్యున్నత న్యాయస్థానం సిట్టింగ్ న్యాయమూర్తి కూడా ఉన్నారు. ప్రత్యేకించి- యాపిల్ ఐఫోన్ వినియోగించే వారి నంబర్లను సులభంగా హ్యాక్ చేసినట్లు సమాచారం.

ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ (spyware Pegasus)ను ప్రయోగించడం ద్వారా హ్యాకర్లు.. వారి ఫోన్ నంబర్లను హ్యాక్ చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ 300 మంది బాధితుల జాబితాలో ఇద్దరు కేంద్రమంత్రులు, మాజీ మంత్రులు, ముగ్గురు ప్రధాన ప్రతిపక్ష నేతలు, 40 మంది జర్నలిస్టులు, దేశ భద్రతా వ్యవస్థకు ప్రధాన అధిపతి, పలువురు వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలిపింది. 2018-2019 మధ్యకాలంలో ఈ హ్యాక్ చోటు చేసుకున్నట్లుగా ది వైర్ వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

Phones Of Politicians, ministers and opposition leaders, Journalists Hacked Using Pegasus

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు అంచనా వేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన స్పైవేర్ పెగాసస్‌‌ను హ్యాకింగ్ కోసం వినియోగించినట్లు ఆ వెబ్‌సైట్ స్పష్టం చేసింది. తాము రూపొందించిన స్పైవేర్ పెగాసస్‌ను ప్రయోగించి ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన వార్తలను ఎన్ఎస్ఓ గ్రూప్ తోసిపుచ్చింది. పెగాసస్ స్పైవేర్‌ను తాము ఇదివరకే విక్రయించామని, ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే పరిమితంగా దాన్ని వినియోగిస్తోన్నారని స్పష్టం చేసింది. నిరాధార ఆరోపణలను చేసినందు వల్ల తాము పరువు నష్టం దావా వేసే ఆలోచనలో ఉన్నట్లు ఎన్ఎస్ఓ గ్రూప్ హెచ్చరించింది.

ఫోన్ల హ్యాకింగ్ వార్తలను కేంద్ర ప్రభుత్వం కూడా తోసిపుచ్చింది. 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. యాపిల్ ఐఫోన్లు సులభంగా హ్యాక్‌కు గురైనట్లు ది వైర్ వెబ్‌సైట్ తెలిపింది. కొన్ని ఫోన్లను ఫోరెన్సిక్‌కు పంపించగా.. అవి హ్యాక్‌కు గురైనట్లు బలమైన ఆధారాలు లభించాయని పేర్కొంది. భీమా-కోరేగావ్ కేసులను వాదిస్తోన్న న్యాయవది, దళిత సామాజిక ఉద్యమ కార్యకర్తలు, ఢిల్లీ యూనివర్శిటీ లెక్చరర్లు, జర్నలిస్టులు.. ఇలా అన్ని ప్రధాన రంగాలకు చెందిన వ్యక్తుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనడానికి ఫోరెన్సిక్ నివేదిక సాక్ష్యంగా నిలుస్తోందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+