కొట్టి.. కేసు పెట్టి.. ఫొటోగ్రాఫర్‌పై తేజ్ ప్రతాప్ బౌన్సర్ల ప్రతాపం..
Recommended Video
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ బాడీగార్డులు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ వద్ద వీరంగం సృష్టించారు. తేజ్ ప్రతాప్ డ్రైవర్ కారణంగా ఓ ఫొటోగ్రాఫర్ గాయపడగా.. అతన్ని సముదాయించాల్సింది పోయి కారు అద్దం ధ్వంసమైందని దాడికి దిగారు. ఇదంతా చూస్తూ కూర్చున్న తేజ్ ప్రతాప్ సదరు ఫొటోగ్రాఫర్‌పై కేసు పెట్టాడు. తనను చంపేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించడం విశేషం.
Tej Pratap Yadav in Patna, Bihar: My bouncers have not done anything. I was leaving after casting my vote when a photographer hit the windscreen of my car. I have filed an FIR in the incident. A conspiracy is being hatched to kill me. pic.twitter.com/60BAIbCxtB
— ANI (@ANI) May 19, 2019
సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా తేజ్ ప్రతాప్ పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆయన తన వాహనంలో కూర్చోవడంతో డ్రైవర్ కారును కొంచెం ముందుకుపోనిచ్చాడు. అయితే ఆ సమయంలో తేజ్ ప్రతాప్ ఫొటోలు తీస్తున్న ఒక ఫొటోగ్రాఫర్ కాలు ఆ వాహనం టైర్ కింద నలిగిపోయింది. సరిగ్గా కాలిపై టైరు ఉండటంతో కారును వెనక్కి తీయమని అన్నారు. ఆ గందరగోళంలో తేజ్ ప్రతాప్ కారు అద్దం ధ్వంసమైంది.

కారు అద్దం పగలడంతో తేజ్ ప్రతాప్ బౌన్సర్ ఒకరు కోపంతో రెచ్చిపోయాడు. ఫొటోగ్రాఫర్‌పై పిడిగుద్దులు కురిపించి, కెమెరాను ధ్వంసం చేశాడు. పోలీసులు మిగతా ఫొటోగ్రాఫర్లు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇంత జరిగినా తేజ్ ప్రతాప్ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. అంతేకాదు.. తమ బౌన్సర్ల తప్పేమీలేదని వారి చర్యను సమర్థించుకున్నారు. తాను ఓటు వేసి వెళ్తుండగా సదరు ఫొటోగ్రాఫర్ కారు అద్దాలు ధ్వంసం చేశాడంటూ తేజ్ ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం గమనిస్తే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని తేజ్ ప్రతాప్ ఆరోపించడం కొసమెరుపు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications