దేశ శతృవు కుటుంబంతో సోనియా చెట్టాపట్టాల్..!!

Sonia Gandhi: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్తాన్ తో భారత్ శత్రుత్వం పతాకస్థాయికి చేరింది. రెండు దేశాల మధ్య దాడులు- ప్రతిదాడులు సైతం చోటు చేసుకున్నాయి. యుద్ధ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తొలగట్లేదు.

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ మాజీ అధినేత్రి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి చెందిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత, ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో, ఆయన చెల్లెళ్లు భక్తవార్, ఆసిఫాతో సోనియా గాంధీ కలిసిన ఫొటోలు అవి.

Photographs resurface of Sonia Rahul Priyanka had meeting with Bhuttos in Beijing in 2008

2008లో బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా సోనియా గాంధీ- బిలావల్ భుట్టో కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. నాడు బిలావల్ భుట్టు కుటుంబ సభ్యులను కలిసిన వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అదే భేటీలో పీపీపీ సీనియర్ నాయకులు జహంగీర్ బాదార్, రెహ్మాన్ మాలిక్ సైతం ఉన్నారు.

ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరు కావడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) ఆహ్వానం మేరకు ఈ రెండు దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు బీజింగ్‌కు చేరుకున్నాయి. ఆ సమయంలో ఈ రెండు కుటుంబాలు మర్యాదపూరకంగా కలుసుకున్నాయి. దాదాపు 30 నిమిషాల పాటు వారి మధ్య ఈ భేటీ కొనసాగింది.

అదే సంవత్సరం ప్రారంభంలో హత్యకు గురైన బిలావల్ భుట్టో తల్లి, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్యపై సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఆ సమయంలో రెహమాన్ మాలిక్ ఓ అధికారిక ప్రకటన సైతం విడుదల చేశారు. ఈ సమావేశాన్ని వ్యక్తిగతమైనదిగా పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని తేల్చి చెప్పారు.

అదే సమయంలో- కాంగ్రెస్.. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందంటూ వార్తలొచ్చాయి అప్పట్లో. దీనిపై పలు మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ఈ అవగాహన ఒప్పందంలోని విషయాలు ఎప్పుడే గానీ పూర్తిగా వెలుగులోకి రాకపోవడం, వాటిని కాంగ్రెస్ పార్టీ బహిరంగపరచకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Photographs resurface of Sonia Rahul Priyanka had meeting with Bhuttos in Beijing in 2008

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఆ సంవత్సరం చివరిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కూడా ఇలాంటి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుందంటూ కథనాలు వెలువడ్డాయి గానీ దీన్ని అధికారికంగా ఎవ్వరూ ధృవీకరించలేదు. ఇప్పుడు.. 18 సంవత్సరాల తరువాత బీజింగ్ లో సోనియా గాంధీ- బిలావల్ భుట్టో కుటుంబం కలుసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2008 నాటి ఫొటోలు వెలుగులోకి రావడం పలు కొత్త ప్రశ్నలను లేవనెత్తినట్టయింది. ఆ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఈ సమావేశం అధికారికం కాకపోయినప్పటికీ- బీజింగ్ వేదిక కావడం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆహ్వానం మేరకు జరగడం అందరి దృష్టినీ ఆకర్షించింది.. ఆసక్తిని రేకెత్తించింది.

ఈ సమావేశం ఉద్దేశాన్ని, సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేస్తోన్నారిప్పుడు. కాంగ్రెస్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. తెర వెనుక ఉన్న రాజకీయ వ్యవహారాలు, అంశాల గురించి తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కు ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+