రేపు విశాఖకు మోడీ: అక్కడే ఉంటానని బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హుధుద్ తుఫాను పైన ఆదివారం ఉదయం నుండి సమీక్షలో మునిగిపోయారు. హుధుద్ తుఫాను ఏపీ తీర ప్రాంతాన్ని ముంచి వేసిన విషయం తెలిసిందే. విశాఖలో అందరికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమీక్షలతో బిజీగా గడిపారు. అంతేకాదు, పరిస్థితి మామూలు స్థితికి వచ్చే వరకు తాను విశాఖలోనే ఉంటానని చంద్రబాబు చెప్పారు.
కాగా, ప్రదానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాంధ్రలో హుధుద్ తుపాను మిగిల్చిన విషాదం గురించి తెలుసుకుని చలించిపోయారు. మంగళవారం ఉదయం పది గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్త్తున్నారు. విశాఖపట్నం చేరుకున్న వెంటనే మోడీ చంద్రబాబుతో కలిసి ఏరియల్ సర్వే చేస్తారు. తుపాను పరిస్థితిని ఎప్పటికపుడు తెలుసుకుంటున్నట్టు వెల్లడించారు.

చంద్రబాబు
హుధుద్ తుఫాను నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. చంద్రబాబు ప్రధానికి అప్పటి పరిస్థితిని వివరించారు. సాయంత్రం తాను విశాఖకు వెళ్లి పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తానని చంద్రబాబు ప్రధానికి తెలిపారు.

చంద్రబాబు
హుధుద్ తుపానుపై చంద్రబాబు సమీక్ష జరిపి, మీడియాతో మాట్లాడుతున్న సమయంలో నరేంద్ర మోడీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో, ప్రసంగాన్ని ఆపి, మోడీతో చంద్రబాబు మాట్లాడారు. విశాఖ హెచ్చరికల కేంద్రానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీకి తెలిపారు.

చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్లుప్తంగా వివరించారు. సహాయక చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం తాను విశాఖకు వెళుతున్నానని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

చంద్రబాబు
మోడీతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... తానే మోడీకి ఫోన్ చేద్దామనుకున్నానని, ఇంతలో ఆయనే ఫోన్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని మోడీ చెప్పారని, కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారని తెలిపారు.
తుపాను గురించి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీలో ఉన్నతాధికారులు కూడా సమావేశమై తుపాను పరిస్థితిని సమీక్షించారు. చంద్రబాబు రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి బయలుదేరేముందు మీడియాతో మాట్లాడుతుండగా రాజ్‌నాథ్ ఫోన్ చేశారు. యుద్ధప్రాతిపదికన ఏయే చర్యలు తీసుకున్నదీ చంద్రబాబు వివరించారు.
సహాయ చర్యల అమలు కోసం విశాఖపట్నంలోనే కలెక్టరేట్‌లో ఉంటామన్నారు. సోమవారం రహదారులపై చేరిన చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో ఉన్నామని, యుద్ధ ప్రాతిపదికపై పనులు చేపట్టామన్నారు. ఈ రోజు వస్తే బాగుంటుందా, రేపు వస్తే బాగుంటుందా అని హోంమంత్రి వాకబు చేయగా, రేపు వస్తే బాగుంటుందని చంద్రబాబు చెప్పారు. ఐఎఎస్ అధికారులు, ఇతర సిబ్బందీ వేల సంఖ్యలో విశాఖపట్నం చేరుకుని సహాయ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారని రాజ్‌నాథ్‌కు వివరించారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications