వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తివారి క్లాస్‌లకు ఖుర్షీద్..?: రాహుల్ కూడా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పైన కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన 'నపుంసకుడు' వ్యాఖ్యల పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్లోను స్పందిస్తున్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలను తప్పు పట్టారు.

2014 లోకసభ ఎన్నికల్లో ఓడిపోతామనే ఒత్తిడిలోనే కాంగ్రెసు పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది.

సల్మాన్ ఖుర్షీద్ వంటి ప్రావీణ్యం గల వైద్యులు ఉన్నందున కాంగ్రెసు తన పార్టీని మూసేసి, ఓ ఆసుపత్రిని తెరవాలని, తివారీ పొటెన్సీ కోచింగ్ క్లాసులలో సల్మాన్ ఎప్పుడు జాయిన్ అయ్యారని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు ఖుర్షీద్ వ్యాఖ్యలను మిస్ లీడ్ చేయవద్దని, ఆయన గోద్రా అల్లర్ల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేశారని ఇంకొందరు స్పందిస్తున్నారు.

సల్మాన్ ఖుర్షీద్

సల్మాన్ ఖుర్షీద్

బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని నపుంసకుడిగా పేర్కొన్న కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తన వ్యాఖ్యలను ఆ తర్వాత కూడా సమర్థించుకున్నారు.

ఖుర్షీద్

ఖుర్షీద్

మంగళవారం ఫరూఖాబాద్‌లో జరిగిన సభలో ఖుర్షీద్ మోడీని నపుంసకుడంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బిజెపి తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగింది.

స్పందన

స్పందన

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోడీ పాత్రపై మాట్లాడటానికి తనకు అంతకన్నా సరైన పదం దొరకలేదని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఖుర్షీద్ బుధవారం పునరుద్ఘాటించారు.

మిస్ లీడ్

మిస్ లీడ్

ఆ వ్యాఖ్యను తాను మోడీ శారీరకస్థితిని ఉద్దేశించి అనలేదని, రాజకీయంగా ఆయన అసమర్థతను ఉద్దేశించి మాత్రమే అన్నానని తెలిపారు.

తివారీ

తివారీ

తాను మోడీ వ్యక్తిగత డాక్టర్‌ని కానని కాబట్టి ఆయన శారీరక స్థితి గురించి తాను మాట్లాడటం లేదని, రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తిగా తాను ఆయన్ను నపుంసకుడిగా పేర్కొంటున్నానని ఖుర్షీద్ తెలిపారు.

సల్మాన్

సల్మాన్

'గుజరాత్ అల్లర్లు మీకు తెలిసే జరిగాయా.. లేక అసమర్థతతో మీరు అల్లర్లను నిలువరించలేకపోయారా.. వాస్తవాలు చెప్పండి' అని ఖుర్షీద్ మోడీని కోరారు.

ఖుర్షీద్

ఖుర్షీద్

అల్లర్లను నిలువరించలేని అసమర్థులే అయితే అలాంటి వారిని రాజకీయంగా నపుంసకులని కాక మరేమంటారని ఖుర్షీద్ ప్రశ్నించారు.

 కేంద్రమంత్రి

కేంద్రమంత్రి

ఖుర్షీద్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, అవమానకరం అంటూ బిజెపి అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కనీస మర్యాదను విస్మరించారు. ఈ వ్యాఖ్యలను సోనియా హర్షించగలరా? అన్నారు.

English summary
Salman Khurshid's controversial remark on Narendra Modi being "impotent" has not angered the BJP. In fact, they pity the Congress leaders for being so open about their frustrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X