వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్లో బాబు హల్‌చల్: ఆఫీస్‌లో లోకేష్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం కర్నాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యూటనిక్స్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదును అంతర్జాతీయ చిత్రపటంలో తాము నిలిపామని, ఏపీలోను ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తామన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు.

పరిశ్రమలు, ఐటీ సంస్థలకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. సంక్షేమ పథకాల్లో ఐటీ సాయంతో అనర్హులను ఏరివేస్తున్నామన్నారు. క్లౌండ్ కంప్యూటింగ్ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామన్నారు. నీటి విషయం చాలా సున్నితమైన అంశమని, కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. నవ్యాంధ్రలో విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు.

కాగా, సోమవారం నాడు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి సాంకేతిక హంగులతో అట్టహాసంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. చంద్రబాబు తొలి పేరును నమోదు చేసుకున్నారు. అనంతరం ముఖ్య పార్టీ నేతలు సభ్యత్వం స్వీకరించారు. కాగిత రహిత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ పెద్ద ఎత్తున చేపట్టింది.

సభ్యత్వం

సభ్యత్వం

సోమవారం నాడు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి సాంకేతిక హంగులతో అట్టహాసంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. చంద్రబాబు తొలి పేరును నమోదు చేసుకున్నారు.

సభ్యత్వం

సభ్యత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 25 లక్షల మందిని పార్టీ కార్యకర్తలుగా చేర్చుకోవాలనే లక్ష్యంతో సభ్యత్వాన్ని ప్రారంభించినట్టు నారా లోకేష్ చెప్పారు.

సభ్యత్వం

సభ్యత్వం

తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపైన అధికార పార్టీ ఒత్తిడి చేస్తున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.

సభ్యత్వం

సభ్యత్వం

పార్టీకి అండగా ఎనలేని సేవలను కార్యకర్తలు అందించారని తెలుగుదేశం ఏ పక్షంలో ఉన్నా కార్యకర్తలు తమ వెన్నంటే ఉన్నారని అన్నారు.

సభ్యత్వం

సభ్యత్వం

పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. నారా లోకేష్ సరికొత్త విధానాన్ని రూపొందించి సభ్యత్వ నమోదును సులభతరం చేశారని అన్నారు.

సభ్యత్వం

సభ్యత్వం

ఆంధ్రలో ప్రభుత్వం వచ్చి తెలంగాణలో రాకపోవడం దురదృష్టకరమని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అప్పుడే ప్రజలు అసహ్యించుకునే దుస్థితి వచ్చిందని అన్నారు.

సభ్యత్వం

సభ్యత్వం

కళా వెంకటరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. హుదూద్ బాధిత ప్రాంతాల్లో పది రోజుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరింపచేసి తనేంటో చంద్రబాబు నాయుడు రుజువు చేసుకున్నారని చెప్పారు.

 సభ్యత్వం

సభ్యత్వం

యర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి రెండు పండుగలు అని అన్నారు. ఆరు నెలల్లో తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీకీ రాని ఊపు తెలుగుదేశం పార్టీకి వస్తుందని అన్నారు.

సభ్యత్వం

సభ్యత్వం

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ, ఎంపి మల్లారెడ్డి, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, సమన్వయకర్త టిడి జనార్ధనరావు, మీడియా కమిటీ చైర్మన్ ఎల్ వి ఎస్ ఆర్ కె ప్రసాద్, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ వివివి చౌదరి, వి జయరామిరెడ్డి, కడప టిడిపి ఎంపి అభ్యర్థి శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వం

సభ్యత్వం

తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎన్నారైల నుండి మంచి స్పందన వస్తోంది. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పిలుపు మేరకు ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

 సభ్యత్వం

సభ్యత్వం

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని పార్టీలో సభ్యులుగా నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఇంత వరకూ నమోదు చేసుకున్న వారి వివరాలను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీకి పంపించి వారికి గుర్తింపుకార్డులను జారీ చేస్తామని అన్నారు.

సభ్యత్వం

సభ్యత్వం

నమోదు చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్ లేదా ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం యుఎస్‌ఎ ఎట్ ద రేట్ ఆఫ్ జిమెయిల్‌కు పంపించవచ్చని అన్నారు.

English summary

 Photos of MEMBERSHIP DRIVE IN NTR TRUST BHAVAN on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X