వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభకు సచిన్, ప్రీతం ముండే: డింపుల్‌తో తేజ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. పాత జనతాదళ్‌ పార్టీలన్నీ చేతులు కలిపాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీతో తలనొప్పులు ఎదుర్కొంటున్న టీఎంసీ కూడా కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకుంది.

ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడిగావేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 23 వరకు మొత్తం 22 పని దినాలు సమావేశం కానుంది. నరేంద్ర మోడీ సర్కార్‌ ఏర్పడిన తర్వాత రెండో సమావేశాలు ఇవి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 37 బిల్లులకు ఆమోదముద్ర సాధించాలని భావిస్తోంది.

ప్రధానంగా భీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి పెంచే బిల్లును చట్టం చేయ్యాలని భావిస్తోంది. దానికి అడ్డు పడతామని జనతా పరివార్‌ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఆ పార్టీలు పార్లమెంట్‌లో ఒత్తిడి గ్రూప్‌గా పని చేయాలని ఇప్పటికే వ్యూహరచన చేశాయి. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు సమాజ్‌వాదిపార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌, జనతాదళ్‌ యునైటెడ్‌, జనతాదళ్‌ సెక్యూలర్‌, వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించాయి.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సోమవారం నాడు రాజ్యసభకు హాజరయ్యారు. శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

తేజ్ ప్రతాప్ యాదవ్

తేజ్ ప్రతాప్ యాదవ్

సమాజ్‌వాది పార్టీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

శీతాకాల పార్లమెంటు సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. లోకసభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి తదితరులు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సోమవారం నాడు రాజ్యసభకు హాజరయ్యారు. శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కారు దిగుతున్న మాస్టర్.

నితిన్, జవదేకర్

నితిన్, జవదేకర్

కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవదేకర్‌లు పార్లమెంటు ఆవరణలో మాట్లాడుకుంటున్న దృశ్యం. శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

ప్రీతమ్ ముండే

ప్రీతమ్ ముండే

దివంగత గోపినాథ్ ముండే కూతురు, ఎంపీ ప్రీతమ్ ముండే సోమవారం లోకసభకు హాజరయ్యారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

డింపుల్, తేజ్

డింపుల్, తేజ్

సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరైన యూపీ సీఎం అఖిలేష్ సతీమణి, ఎంపీ డింపుల్ యాదవ్, మరో ఎస్పీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్.

మనోహర్ పారికర్

మనోహర్ పారికర్

భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సోమవారం సభకు హాజరయ్యారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్రమంత్రుల్ని మోడీ సభకు పరిచయం చేశారు.

ప్రీతమ్ ముండే

ప్రీతమ్ ముండే

దివంగత గోపినాథ్ ముండే కూతురు, ఎంపీ ప్రీతమ్ ముండే సోమవారం లోకసభకు హాజరయ్యారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభకు హాజరయ్యేందుకు వచ్చిన సచిన్ టెండుల్కర్ విలేకరులతో మాట్లాడుతూ...

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరవుతున్నకేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన మరో ఎంపీ దీపేందర్ సింగ్ హూడాలు సోమవారం లోకసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెయిలింగ్ దాటుతున్న దృశ్యం.

English summary
Cricket legend and Rajya Sabha MP Sachin Tendulkar at Parliament House in New Delhi on the first day of winter session on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X