వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటకు రాకండి, రిసార్ట్‌కు వెళ్లొద్దు: పన్నీరుకు డీజీపీ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్టుకు వెళ్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. డీజీపీ సూచనల మేరకే ఆయన వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్టుకు వెళ్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. డీజీపీ సూచనల మేరకే ఆయన వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం అంత మంచిదికాదని, బయట ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని పన్నీర్ సెల్వంకు డీజీపీ సూచించారని, అందుకే, పన్నీర్ వెనక్కి తగ్గారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఇంటి నుంచి బయటకు రావొద్దని కూడా పన్నీరుకు డీజీపీ చెప్పారని తెలుస్తోంది. అందుకే సచివాలయానికి వెళ్లలేదంటున్నారు.

<strong>జైలుకు శశికళ!: వెలుగులోకి మరో రెండు ఆసక్తికర విషయాలు</strong>జైలుకు శశికళ!: వెలుగులోకి మరో రెండు ఆసక్తికర విషయాలు

బీజేపీ స్పందన

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కలలుగన్న శశికళను అక్రమాస్తుల కేసులో దోషిగా సుప్రీం కోర్టు తేల్చింది. న్యాయస్థానం తీర్పుతో రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అభిప్రాయపడ్డారు.

Picking proxy can never win people's trust: BJP on Sasikala's move

అన్నాడీఎంకే పార్టీ సంక్షోభంలో ఉందని, నాయకత్వాన్ని ఎంచుకునే విషయంపై అసలైన పరీక్ష ఎదురు కాబోతోందన్నారు.

<strong>మరో ప్రమాదం!: పన్నీరుకు ఊహించని షాకిచ్చిన శశికళ</strong>మరో ప్రమాదం!: పన్నీరుకు ఊహించని షాకిచ్చిన శశికళ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మాదిరిగా ఎదురులేని నాయకత్వం, ప్రజాదరణ శశికళకు లేకపోవడంతో విశ్వాసపాత్రుడిని పెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చన్నారు. తమిళనాడు ప్రజల ఆకాంక్ష మేరకు ప్రస్తుతం అక్కడ స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తక్షణావసరమని కేంద్రమంత్రి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు.

English summary
With AIADMK general secretary V K Sasikala pushing her nominee to be the next Tamil Nadu chief minister, the Bharatiya Janata Party on Tuesday said appointment of a proxy can never win people’s trust and urged the Governor to take a decision on the basis of numbers as well as credibility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X