ఇక్కడ జయ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం (ఫొటోలు)

హైదరాబాద్: తమిళనాడులో దళిత బాలుడి చేయిని నరికిన ఘటనపై హైదరాబాదులో కెవిపిఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు శుక్రవారంనాడు జయలలిత నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దాడి చేసిన అగ్రవర్ణ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తమిళనాడులోని ఓ గ్రామంలో గడియారం పెట్టుకున్నందుకు పాఠశాలలో బుధవారం రాత్రి ఓ దళిత బాలుడి మణికట్టును నరికేసిన విషయం తెలిసిందే. తిరుంగళ్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్న మాధ్యమిక పాఠశాలలో ప్లస్ వన్ 16 ఏళ్ల రమేష్ అనే బాలుడి మణికట్టును అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు నరికారు.

బుధవారం రాత్రి రమేష్ తిరతనంగళ్ రైల్వే స్టేషన్ వద్ద నడుస్తుండగా దాదాపు 15 మంది బాలురతో కూడిన ముఠా అడ్డుకుని అతని మణికట్టును నరికేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి నుంచి తప్పించుకున్న బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో అతను చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

దిష్టిబొమ్మను ఊరేగించారు

దిష్టిబొమ్మను ఊరేగించారు

దళిత విద్యార్థి మణికట్టును అగ్రవర్ణాల విద్యార్థులు నరికేసిన సంఘటనపై హైదరాబాదులో కెవిపిఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

దిష్టిబొమ్మ దగ్ధం

దిష్టిబొమ్మ దగ్ధం

దళిత బాలుడిపై దాడికి నిరసనగా కెవిపిఎస్ కార్యకర్తలు తమిళనాడు ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

కెవిపిఎస్ ఆందోళన

కెవిపిఎస్ ఆందోళన

తమిళనాడులో రమేష్ అనే దళిత విద్యార్థి మణికట్టును అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు నరికి కుల దురహంకారాన్ని ప్రదర్శించారని కెవిపిఎస్ కార్యకర్తలు ఆరోపించారు.

హైదరాబాదులో ఆందోళన

హైదరాబాదులో ఆందోళన

తమిళనాడులో దళిత విద్యార్థి చేతికి వాచీ ధరించినందుకు అగ్రవర్ణాల విద్యార్థులు అతనిపై దాడి చేసినందుకు హైదరాబాదులో నిరసన వ్యక్తమైంది.

కెవిపిఎస్ డిమాండ్

కెవిపిఎస్ డిమాండ్

చేతికి గడియారం పెట్టుకున్నందుకు కుల దురహంకారంతో వ్యవహరించి అగ్రవర్ణాల విద్యార్థులు దళిత బాలుడిపై దాడి చేయడాన్ని కెవిపిఎస్ కార్యకర్తలు నిరసించారు.

దాడికి నిరసనగా నినాదాలు

దాడికి నిరసనగా నినాదాలు

తమిళనాడులో రమేష్ అనే దళిత విద్యార్థిపై అగ్రవర్ణాల విద్యార్థులు దాడి చేయడాన్ని హైదరాబాదులో కెవిపిఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+