ఫ్యూయెల్ కట్ బటన్ ఎందుకు నొక్కావ్?- గట్టిగా అరిచిన పైలెట్
Air India flight crash: దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం అయింది. బ్లాక్ బాక్స్ లభించిన తరువాత కుట్ర కోణం సైతం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దిశగా విచారణ చేపట్టింది.
ఈ దుర్ఘటనపై ప్రస్తుతం విమాన ప్రమాద పరిశోధన బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూరో ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. పలు అంశాలను ఇందులో పొందుపరిచింది. బ్లాక్ బాక్స్ డేటాను సైతం ఈ బ్యూరో విశ్లేషించినట్లు తెలుస్తోంది.

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన మూడు సెకన్ల తర్వాత, ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంజిన్ల వేగం తగ్గింది. 54,200 కిలో లీటర్ల ఇంధనంతో 213.4 టన్నుల బరువున్న విమానం ఎయిర్‌పోర్ట్ ప్రహరీ గోడను దాటేలోపే ఎత్తును కోల్పోయింది.
ఇంజిన్ 1, ఇంజిన్ 2 ఇంధన సరఫరా స్విచ్‌లు ఒక సెకను వ్యవధిలో కటాఫ్ అయ్యాయి. రన్ నుండి కట్ ఆఫ్గా పడిపోయాయి. ఇది ఎలా? ఎందుకు జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయిన 26 సెకన్ల తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత ఆరు సెకన్లలో విమానం ప్రమాదానికి గురైంది.
ఊహించని విధంగా ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఇద్దరు పైలట్లు దిగ్భ్రాంతికి గురైనట్లు ఏఏఐబీ నివేదిక వెల్లడించింది. పైలట్లలో ఒకరు- ఎందుకు ఆపావు.. అని మరొక పైలట్‌ను అడగడం.. దానికి మరో పైలట్ నేను అలా చేయలేదు.. అ సమాధానం ఇచ్చినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
కాక్ పిట్ వాయిస్ రికార్డింగ్ లో దీనికి సంబంధించిన పూర్తి డేటా రికార్డయింది. రెండు ఇంజిన్లకు ఇంధనం సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడంతో పైలెట్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడే ప్రమాదాన్ని శంకించారు. ఫ్యూయల్ బటన్ ఎందుకు కట్ చేశావని గట్టిగా అరిచినట్లు ఓ పైలెట్.. మరో పైలెట్ తో చెప్పడం కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో వినిపించినట్లు ఏఏఐబీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
దీనికి రెండో పైలట్ తాను అలా చేయలేదని సమాధానమివ్వడం వినిపించింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కు చెందిన రెండు ఇంజిన్లు కూడా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక సెకను వ్యవధిలో ఆగిపోయాయని నివేదికలో ఉంది. దీనివల్ల విమానం ఎత్తును కోల్పోయింది. గాల్లోకి ఎగరలేకపోయింది.
ఓ విమానం రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం అనేది అసాధారణం. ఎయిరిండియా విమానంలో దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. టేకాఫ్ అయిన వెంటనే రెండు ఇంజిన్లకూ ఇంధన సరఫరా స్తంభించింది. ఫలితంగా అది శక్తివిహీనమైంది. సెకెన్ల వ్యవధిలో కుప్పకూలింది.












Click it and Unblock the Notifications