శశికళకు పరీక్ష.. అసెంబ్లీలో ఎవరికి బలముంటే వారే సీఎం: గవర్నర్‌కు ఏజీ

తమిళనాడులో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వారంలో ఈ సంక్షోభానికి ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభం పైన ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు అటార్నీ జనరల్ సూచన చేశారు.

చెన్నై: తమిళనాడులో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వారంలో ఈ సంక్షోభానికి ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభం పైన ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సూచన చేశారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, ఎవరికి మెజార్టీ ఉంటే వారిని ముఖ్యమంత్రి చేయాలని సలహా ఇచ్చారు.

వారంలోగా తమిళనాడులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలన్నారు. సభలో ఎవరికి మెజార్టీ ఉందో తేలాలని, మేజిక్ ఫిగర్ ఎవరికి ఉంటే వారు ముఖ్యమంత్రి అని చెప్పారు.

sasikala

శశికళ హాజరు కావొచ్చు కానీ..

ఒకే పార్టీలో... అంటే అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పీఠం కోసం పోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత పన్నీరు సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు, శశికళ కొద్ది రోజుల క్రితం పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలో శశికళ సభకు రావొచ్చు. కానీ ఆమె ప్రజాప్రతినిధి కాదు కాబట్టి ఓటింగులో పాల్గొనరు. మిగతా ఎమ్మెల్యేలు ఓటింగులో పాల్గొంటారు. ఎవరికి మెజార్టీ ఉంటే వారు ముఖ్యమంత్రి అవుతారు.

1990లో ఉత్తర ప్రదేశ్‌లో ఇలాగే..

1990లో ఉత్తర ప్రదేశ్‌లో ఫ్లోర్ టెస్ట్ జరిగింది. అప్పుడు జగదాంబిక పాల్, కళ్యాణ్ సింగ్‌ల మధ్య ఫ్లోర్ట టెస్ట్ జరిగింది. నాడు ఉత్తర ప్రదేశ్‌లో ఉపయోగించిన ఫార్ములానే ఇప్పుడు తమిళనాడుకు అప్లై చేయాలని అటార్నీ జనరల్ సూచించారు. ఇదిలా ఉండగా, జయ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు మంగళవారం రానుంది. ఇటు సుప్రీం తీర్పు, అటు ఫ్లోర్ టెస్ట్‌లో శశికళ నెగ్గవలసి ఉంది. ఇది ఇప్పుడు మరింత ఉత్కంఠకు దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+