బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనరల్ బోగీలో రైల్వే శాఖ మంత్రి ప్రయాణం, సెల్ఫీలు, ఏసీ బోగీ, కావేరీ ఎక్స్ ప్రెస్ లో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రైల్వే శాఖలో సామాన్య ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి అనే విషయం తెలుసుకోవడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ స్వయంగా జనరల్ బోగీలో ప్రయాణించారు. రైల్వే ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి అని ఆరా తీశారు. ఏసీ బోగీని వద్దని జనరల్ బోగీలో ప్రయాణించిన కేంద్ర మంత్రి చిన్నారులతో సరదాగా స్పెల్ఫీలు తీసుకున్నారు.

అధికారులకు సమాచారం

అధికారులకు సమాచారం

కర్ణాటకలోని మైసూరు రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు నగరానికి కావేరీ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరింది. కావేరీ ఎక్స్ ప్రెస్ రైలులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బెంగళూరు వరకూ ప్రయాణిస్తారని రైల్వే శాఖ అధికారులకు సమాచారం ఉంది.

జనరల్ బోగీలో

జనరల్ బోగీలో

అయితే ఏసీ బోగీలో కాకుండా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఒక్కసారిగా జనరల్ బోగి ఎక్కారు. కావేరీ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సామాన్య ప్రజలు, మహిళలు, వృద్దులను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పలకరించి మీకు ఎమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

సౌకర్యాలు, శుభ్రత

సౌకర్యాలు, శుభ్రత

మీకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయని రైల్వే ప్రయాణికులను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జనరల్ బోగీలలో శుభ్రత ఎలా ఉందని కేంద్ర పీయూష్ గోయల్ స్వయంగా పరిశీలించారు.

 చిన్నారులతో సెల్ఫీలు

చిన్నారులతో సెల్ఫీలు


జనరల్ బోగిలో ప్రయాణించి, తమ సమస్యలు అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను రైల్వే ప్రయాణికులు అభినందించారు. ఇదే సమయంలో జనరల్ బోగీలు ప్రయాణిస్తున్న చిన్నారులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సెల్ఫీలు తీసుకుని ముచ్చట తీర్చుకున్నారు.

English summary
Union Railways Minister Piyush Goyal on Monday travelled in a general coach of Kaveri Express to inspect the passenger amenities. He travelled in the general class from Mysuru to Bengaluru, along with the other passengers and interacted with them regarding the condition of the services provided inside the trains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X