విమానం టైర్ పేలింది: తప్పించుకున్న సీఎం
రాంచీ: విమానం టైర్ పేలిపోవడంతో ఒక ముఖ్యమంత్రితో పాటు ప్రయాణికులు, విమాన సిబ్బంది తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాత్రి జార్ఖండ్ లోని రాంచీలో ఈ సంఘటన జరిగింది.
గురువారం రాత్రి గో ఎయిర్ జీ8-147 అనే విమానం ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరింది. అందులో జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ తో పాటు 154 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో ల్యాండ్ చేస్తున్న సమయంలో టైర్ పేలిపోయింది.

ఆ సందర్బంలో విమానంలో ఉన్న ప్రయాణికులు హడలిపోయారు. పైలెట్ చాకచక్యంగా విమానాన్ని కంట్రోల్ చేసి రనే వే మీద సురక్షితంగా నిలపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమాన సిబ్బంది పరుగున విమానం దగ్గరకు చేరుకుని ప్రయాణికులను ధైర్యం చెప్పారు.
భోపాల్ గురువారం జరిగిన విశ్వ హిందీ సమ్మేళనంలో పాల్గోనడానికి రఘుబర్ దాస్ వెళ్లారు. తిరిగి రాంచీకి వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. గత వారం రోజులలో రెండు విమానం టైర్లు ఈ విమానాశ్రయంలో పేలిపోయాయి.












Click it and Unblock the Notifications