వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన ఘటన: ‘ప్లాస్టిక్ బేబీ’కి జన్మనిచ్చిన మహిళ

|
Google Oneindia TeluguNews

అమృత్‌సర్: ప్రత్యేక లక్షణాలున్న ప్లాస్టిక్ బేబి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలోని రాజసాన్సీ ప్రాంతంలో జన్మించింది. ప్లాస్టిక్ బేబీ జననం ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. శుక్రవారం గురునానక్ దేవ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

ఆరు లక్షల నవజాతశిశువుల్లో ఇలాంటి శిశువు ఒకటి జన్మిస్తుందని, ఇది అత్యంత అరుదైన ఘటన అని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటి ప్లాస్టిక్ బేబీలను శాస్త్రీయంగా కొల్లోడియన్ బేబీ (మండే స్వభావమున్న పైరాక్సిలీన్ ద్రవ లేపనంతో ఉండే శిశువు)గా పిలుస్తారని చెప్పారు. శిశువు ముఖం చేప ముఖాన్ని పోలి ఉండి, చూడగానే రబ్బరు బొమ్మను గుర్తుకు తెచ్చే విధంగా కనిపించిందని చెప్పారు.

 'Plastic baby' born in Punjab's Amritsar

‘ఎవరైనా ముట్టుకుంటే వెంటనే ఏడవడం మొదలుపెట్టేది. కళ్లు, పెదవులు ఎర్రగా ఉన్నాయి.
తన తల్లి నుంచి పాలు తాగలేకపోయింది' అని వైద్యులు తెలిపారు. ఇది ఓ రకమైన జన్యుపరమైన లోపమని, కొన్ని జన్యువుల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవడం, అలైంగిక క్రోమోజోముల మాంద్యత, ఇతర కారణాల వల్ల పుట్టుకతోనే ఎండిపోయిన శరీరంతో ఇలాంటి శిశువులు జన్మిస్తారని తెలిపారు.

‘ప్లాస్టిక్ బేబీల్లో సాధారణంగా చర్మం చిట్లిపోతుంది. చర్మం కుబుసం మాదిరిగా దానంతట అదే లేచిపోవడంతో శిశువుకు భరించలేనంతగా బాధ ఉంటుంది. ఓ దశాబ్దం క్రితం ఇలాంటి బేబీ నా దృష్టికి వచ్చింది' అని అని చంఢీగడ్‌లోని బేడీ హాస్పిటల్ డైరెక్టర్ ఆర్‌ఎస్ బేడీ పేర్కొన్నారు. 2014 తర్వాత చంఢీగడ్‌లో ప్లాస్టిక్ బేబీ జన్మించడం ఇది రెండవసారి.

కాగా, 2014లో పుట్టిన ప్లాస్టిక్ బేబీ.. మూడో రోజు మరణించిందని వైద్యులు తెలిపారు. ఇలాంటి బేబీలకు మాశ్చరైజర్స్ ఉపయోగించాలని, నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

English summary
A woman here has given birth to what is known as a 'plastic baby', as per reports.The girl, a collodion baby, was born to a woman from Rajansansi area of Amritsar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X