వేడి నీటితో సరిపెట్టిన మోడీ: ప్లీజ్ తినండని ఒబామాతో..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ఇచ్చిన విందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనకు వైట్‌హౌజ్ ఘనస్వాగతం పలికింది. అయితే ఆయన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ అధ్యక్షుడి విందులో కేవలం వేడి నీటిని మాత్రమే తీసుకున్నారు.

తను ఉపవాసంలో ఉన్నానని చెప్పిన మోడీ.. దయచేసి మీరు డిన్నర్ చేయండని ఒబామాను, ఇతర మంత్రులు, ప్రతినిధులను కోరారు. ఈ మేరకు వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

 Please Eat, Said Fasting PM to Obama, Others at White House Dinner

ప్రోటోకాల్ ప్రకారం విందు సందర్భంగా మోడీ ముందు ఓ ప్లేటు పెట్టారు. అయితే మోడీ మాత్రం ఓ గ్లాసులోని వేడి నీటిని సేవించారు. ప్రతీ ఏడాది నవరాత్రుల సందర్భంగా ఎంతో కఠినంగా ఉపవాసం చేసే మోడీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. అందువల్లే ఆయన ఆహారం ఏమి తీసుకోకుండా నీటిని మాత్రమే తాగారు. ప్రస్తుతం ఆయన ఉపవాసం ఆరు రోజులకు చేరుకుంది.

ఆ విందులో మాంసాహారంతోపాటు శాకాహారన్ని కూడా ఏర్పాటు చేశారు. చేపలు, క్యారెస్ సాస్, అవకాడలు, మేక జున్ను, రోటీ క్రిస్ప్, లాంటి చాలా రకాల వంటకాలను అక్కడ ఉంచారు. మాంసాహారం సేవించేవారి కోసం కాలిఫోర్నియా వైట్ వైన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+