వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సిజన్ కొరత.. 2 గంటల వరకే నిల్వ... అరచేతిలో 500 మంది రోగుల ప్రాణాలు

|
Google Oneindia TeluguNews

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మాములుగా లేదు. వేలాది కేసులు బయటపడుతున్నాయి. ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాల గురించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. జీటీవీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని.. సమస్య పరిష్కరించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.

Please help GTB Hospital, 500 Covid-19 patients need oxygen supply

గత 4 గంటల నుంచి జీటీబీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని సత్యేంద్ర జైన్ ట్వీట్ చేశారు. అక్కడ 500 మంది రోగులు ఆక్సిజన్ కోసం చూస్తున్నారని వివరించారు. ఆయన రాసిన మేసెజ్ స్కీన్ షాట్ తీసి ట్వీట్ చేశారు. అంతేకాదు అర్ధరాత్రి 2 గంటల వరకు మాత్రమే ఇప్పుడు ఉన్న ఆక్సిజన్ అందించగలుగుతామని చెప్పారు. లేదంటే 500 మంది రోగులు ఇబ్బంది పడతారని చెప్పారు. ఢిల్లీలో దవాఖానలకు రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని చెప్పారు. కానీ 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందజేశారని వివరించారు. మంగళవారం అదీ కాస్త పెరిగి 365 మెట్రిక్ టన్నులకి చేరిందని చెప్పారు.

ఢిల్లీ దవాఖానల్లో ఆక్సిజన్ కొరత ఉందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఐసీయూ బెడ్ల కొరత కూడా ఉందని వివరించారు. మంగళవారం ఢిల్లీలో 28 వేల 395 కేసులు వచ్చాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 85 వేల 500 చేరింది.

English summary
Delhi health minister Satyendar Jain on Tuesday took to Twitter and urged Union minister Piyush Goyal to help in overcoming an "acute shortage" of medical oxygen at Delhi's GTB Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X