25ఏళ్ళు రైతులకు ఆదాయం వచ్చేలా.. కేంద్ర పథకం.. అస్సలు మిస్ చేసుకోకండి!

రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అందిస్తున్న పథకంలో పీఎం కుసుమ్ ముఖ్యమైనది. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో సౌరశక్తిని వినియోగించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్రం కృషి చేస్తుంది. అసలు పీఎం కుసుమ్ పథకం ఏమిటి? దానితో రైతులకు కలిగే లాభం ఏమిటి? ఎందుకు రైతులు ఈ పథకం గురించి తెలుసుకోవాలి.

సోలార్ ప్లాంట్ ద్వారా పంప్ సెట్లు నడిచేలా పీఎం కుసుమ్
పంట పొలాలను సాగు చేసే రైతులు ఆ పొలాలను కాపాడుకోవడానికి వాటికి కావలసిన నీటి సదుపాయాన్ని అందించవలసిందే. అయితే విద్యుత్ కోతల కారణంగా ఒక్కొక్కసారి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల విద్యుత్ సమస్యకు చెక్ పెడుతూ, వ్యవసాయరంగంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు సోలార్ ప్లాంట్ ద్వారా పంప సెట్లు నడిచేలా పీఎం కుసుమ్ పథకాన్ని అందిస్తుంది.

PM Kusum scheme benefits farmers with 25 years income source know the scheme benefits

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీ, బ్యాంక్ ఋణంతో స్కీమ్
ఈ పథకం కింద సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా భారీ సబ్సిడీ ఇస్తుంది. రైతు తన వాటాగా 10% ఖర్చును భరిస్తే సరిపోతుంది. మిగిలిన 30 శాతం బ్యాంకు రుణం ద్వారా, ఆపై 60% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీగా వస్తుంది.

రైతులకు ఆదాయం వచ్చేలా పథకం
ఉదాహరణకు ఒక సోలార్ పంప్ సెట్ ను కొనుగోలు చేయడానికి 4లక్షల 50వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే రైతు వాటా కేవలం 45వేల రూపాయలుగా ఉంటుంది. మిగిలిన మొత్తం సబ్సిడీ రూపంలోనూ, బ్యాంకు రుణం రూపంలోనూ లభిస్తుంది. రైతులు తమ పొలాలలో ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ తమకు ఉపయోగించుకోకపోవడంతో పాటు, డిస్కమ్ లకు విక్రయించి రైతులు దానిద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు.

దరఖాస్తుకు అర్హులు వీరే
భారతదేశంలో వ్యవసాయ భూమి ఉన్న ఏ రైతన్న అయినా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. రైతులు వ్యక్తిగతంగానే కాకుండా, సమూహాలు గాను, సహకార సంఘాలు గాను, పంచాయతీలు గాను, ఎఫ్పిఓల ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. అదనపు విద్యుత్ ను విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించడం ద్వారా దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందటమే కాకుండా, రైతుల అవసరానికి విద్యుత్ కష్టాలు లేకుండా ఈ పథకం దోహదం చేస్తుంది.

25 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయ వనరు
రైతులకు ఇది 25 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, విద్యుత్ కోతలు లేని నిరంతరాయ నీటి సరఫరా పంట పొలాల కోసం రైతులకు అందించడం కారణంగా పథకం పెంచడానికి దోహదం చేస్తుంది. ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి PM- KUSUM జాతీయ పోర్టల్ ను సంప్రదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+