కరోనా, వ్యాక్సిన్ ప్రక్రియ: అధికారులతో మోడీ వర్చువల్ రివ్యూ
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆయా ప్రభుత్వాల తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో మోడీ వర్చువల్‌గా రివ్యూ చేశారు. బెంగాల్ ఎన్నికలపై మోడీ ఫోకస్ చేశారని.. అందుకే ఆయనతో మాట్లాడటం వీలుకాలేదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు. అయితే అందరికీ అందుబాటులో ఉన్నానని మోడీ సంకేతాలు ఇస్తున్నారు.
కరోనా నేపథ్యంలో రెండురోజుల్లో మూడో సారి అధికారులతో మోడీ సమీక్ష జరిపారు. మెడికల్ ఆక్సిజన్ సరఫరా గురించి ప్రధానంగా డిస్కష్ జరిగింది. మెడికల్ ఆక్సిజన్ ప్లాంట ఏర్పాటు ప్రక్రియ స్పీడ్ చేయాలని మోడీ ఆదేశాలు జారీచేశారు. 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 162 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. లక్ష సిలిండర్లను త్వరలో రాష్ట్రాలకు సరఫరా చేస్తామని చెబుతున్నారు.

Recommended Video
రెమిడెసివర్ ఇతర మందులకు డిమాండ్ ఉంటుంది. దీంతో ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా ఆ దిశగా కృషి చేయాలని అన్నారు. కరోనా కేసులు పెరుగుతోన్న క్రమంలో మోడీ మీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications