నర్మదాను అడ్డుకున్నవారిని శిక్షించండి-గుజరాతీలకు మోడీ పిలుపు-రాహుల్-మేథాపాట్కర్ భేటీపై
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ పాల్గొనడాన్ని బీజేపీ గుజరాత్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. గుజరాత్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోడీ.. నర్మదా డ్యామ్ ను అడ్డుకున్న వారిని శిక్షించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో మేథా పాట్కర్ సమావేశం కావడాన్ని మోడీ ఈ మధ్య వరుసగా తప్పుబడుతున్నారు. గతంలో గుజరాత్ లో నర్మదా డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా మేథా పాట్కర్ పలు ఉద్యమాలు చేశారు. నర్మదా డ్యామ్ నిర్మాణం కారణంగా భారీ ఎత్తున ప్రజలు నిర్వాసితులవుతారని నినదించారు. దీంతో మేథా పాట్కర్ పేరు చెబితేనే బీజేపీ మండిపడుతుంటుంది. అలాంటి మేథా పాట్కర్ ఇప్పుడు రాహుల్ గాంధీతో భేటీ కావడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 1న ఓటింగ్ జరిగే సురేంద్రనగర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నర్మదా బచావో ఆందోళన్ నేత మేధా పాట్కర్ చేరడంపై కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ఓటర్లు నర్మదా నిరసనకారులను శిక్షించాలని ఆయన ప్రజల్ని కోరారు.
ఈసారి కూడా మోడీ లేదా భూపేంద్ర (సీఎం భూపేంద్రభాయ్ పటేల్) ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కానీ గుజరాత్ ప్రజలు, గుజరాత్ తల్లులు,సోదరీమణులు పోటీ చేస్తున్నారన్నారు. సురేంద్రనగర్ జిల్లాలో నర్మదా గుర్తుకు రావడం సహజమని, ఈ జిల్లాకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి తాను నర్మదా యోజన కోసం సురేంద్రనగర్‌ని చాలాసార్లు సందర్శిస్తాను. అయితే భారతీయులు అధికారం నుంచి తొలగించిన వారి గురించి ఆలోచించాలని, అలాంటివారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారని మోడీ విమర్శించారు.












Click it and Unblock the Notifications