ములాయం మనవడి తిలకం వేడుక: ఢిల్లీ నుంచి మోడీ, ఏపీ నుంచి బాబు(ఫోటోలు)

లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ తిలకం వేడుక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం హాజరయ్యారు. ములాయం, లాలూ ప్రసాద్‌లు మోడీకి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ములాయం, లాలూప్రసాద్‌ యాదవ్‌ పాల్గొని తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను ఆశీర్వదించారు.

మోడీ ఈ కార్యక్రమంలో ములాయం, లాలూ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా 45 నిమిషాలపాటు గడిపారు. ములాయం, లాలూ ఇరువురి మధ్యలో కూర్చొని ఫోటోలకు ఉత్సాహంగా ఫోజులిచ్చారు. అనంతరం ములాయం మాట్లాడుతూ... ప్రధాని మోడీ రాకలో ఎటువంటి రాజకీయ అంశాలు లేవు. మర్యాదపూర్వకంగానే నూతన వరుడికి ఆశీస్సులను అందించారు. ఆహ్వానం మన్నించి వచ్చినందుకుగాను ప్రధానికి మా కృతజ్ఞతలు.

లాలూ ప్రసాద్‌యాదవ్ మాట్లాడుతూ.. మా ఇరువురి మనసుల కలయికతో ఈ పెళ్లి దేశవ్యాప్తంగా చర్చనీయంశం అయింది. నయాపైసా కట్నం కూడా తీసుకోకుండా ములాయం ఈ వివాహ వేడుకను ఘనంగా జరిపిస్తున్నారని తెలిపారు.

ములాయం సొంత గ్రామమైన సైఫైలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం మొయిన్‌పురి ఎంపీగా ఉన్న తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ ఫిబ్రవరి 26న లాలూప్రసాద్‌ యాదవ్‌ చిన్న కుమార్తె రాజ్‌ లక్ష్మిని వివాహమాడనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, ఆంధ్రప్రదేస్ సీఎం చంద్రబాబునాయుడు, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తదితరులకు ఆహ్వానం పంపారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నాయక్‌, యూపీ సీఎం అఖిలేష్‌యాదవ్‌ తదితరులు హాజరయ్యారు.

ప్రధాని మోడీ హాజరవుతుండటంతో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. దీంతో పాటు ప్రధాని హెలికాఫ్టర్ దిగే హెలిఫ్యాడ్ ను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. ములాయం సింగ్‌ యాదవ్‌ తన మనవడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తిలకం వేడుకకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ఆహ్వానం పంపారు.

వివాహ మహోత్సవానికి ముందు తమ సంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేసిన తిలకం దిద్దే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది కూడా పెళ్లి లాంటి వేడుకే. అందుకనే ములాయం కుటుంబ సభ్యులు సుమారు లక్ష మంది అతిధులను ఈ తిలకం దిద్దే వేడుకకు ఆహ్వానించారు.

దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావాహ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో వున్న సైఫై గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తిలకం దిద్దే వేడుక హాజరుకానున్న అతిధులకు పలు రకాల రుచికరమైన, స్వచ్చమైన నేతితో చేసిన మిఠాయిలు అందించనున్నారు. బిదాయ్, బాటీ చోఖా, హల్వా వంటి రుచికరమైన వంటకాలను మెనూలో సిద్దం చేశారు.

ములాయం మనవడి తిలకం వేడుక

ములాయం మనవడి తిలకం వేడుక

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ తిలకం వేడుక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం హాజరు కానున్నారు. ములాయం సొంత గ్రామమైన సైఫైలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం మొయిన్‌పురి ఎంపీగా ఉన్న తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ ఫిబ్రవరి 26న లాలూప్రసాద్‌ యాదవ్‌ చిన్న కుమార్తె రాజ్‌ లక్ష్మిని వివాహమాడనున్నారు.

 ములాయం మనవడి తిలకం వేడుక

ములాయం మనవడి తిలకం వేడుక

ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, ఆంధ్రప్రదేస్ సీఎం చంద్రబాబునాయుడు, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తదితరులు హాజరు కానున్నారు.

ములాయం మనవడి తిలకం వేడుక

ములాయం మనవడి తిలకం వేడుక


వివాహ మహోత్సవానికి ముందు తమ సంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేసిన తిలకం దిద్దే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది కూడా పెళ్లి లాంటి వేడుకే. అందుకనే ములాయం కుటుంబ సభ్యులు సుమారు లక్ష మంది అతిధులను ఈ తిలకం దిద్దే వేడుకకు ఆహ్వానించారు.

 ములాయం మనవడి తిలకం వేడుక

ములాయం మనవడి తిలకం వేడుక

దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావాహ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో వున్న సైఫై గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తిలకం దిద్దే వేడుక హాజరుకానున్న అతిధులకు పలు రకాల రుచికరమైన, స్వచ్చమైన నేతితో చేసిన మిఠాయిలు అందించనున్నారు. బిదాయ్, బాటీ చోఖా, హల్వా వంటి రుచికరమైన వంటకాలను మెనూలో సిద్దం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+