రూ.1.25 లక్షల కోట్లు: బీహార్‌కు మోడీ భారీ ప్యాకేజీ
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ఇచ్చారు. బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌కు ప్రధాని మోడీ ఇచ్చిన ప్యాకేజీ చర్చనీయాంశమవుతోంది. బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు.
బీహార్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీతో బీహారీల దశదిశ మారుతుందని తాను భావిస్తున్నానన్నారు. రైతుల సంక్షేమంతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమన్నారు.
ఈ సందర్భంగా ఆయన రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అంతకుముందు బీహార్‌లోని ఆరాలో జాతీయ రహదారి ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి పుస్తకం విడుదల చేశారు.

ఆరా బహిరంగసభలో మాట్లాడారు. బీహార్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేస్తామని హామీ ఇచ్చారు. బీహార్ ప్రాజెక్టుల కోసం అదనంగా మరో రూ.40వేల కోట్లు ఖర్చుపెడతామని ప్రధాని మోడీ చెప్పారు.
బీహార్ అభివృద్ధఇ చెందితే ఎక్కువగా ఆనందించేది తానే అని చెప్పారు. దళితుల అభ్యుదయం కోసం కృషి చేసిన వ్యక్తిని బీహార్ గవర్నర్‌గా నియమించామని చెప్పారు. బీహార్ పర్యటనలో మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.25వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనం చేశారు. 23 స్కిల్ ట్రెయినింగ్ సెంటర్లు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications