నయా పంజాబ్ నిర్మిస్తాం, కాంగ్రెస్ కుయుక్తులు.. జలంధర్‌లో జనంతో మోడీ

పంజాబ్ ఎన్నికల్లో నేతలు బిజీగా ఉన్నారు. ఓటరు మహా దేవుళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్ రూపు రేఖలు మార్చుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఇవాళ జలంధర్‌లో ఆశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. త్రిపుర్‌మాలిని దేవి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నానని.. కానీ అధికారులు అందుకు ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. అయినప్పటికీ తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు.

అంతర్జాతీయ మార్కెట్ల కన్నా తక్కువ రేటుకు ఎరువుల, పురుగుల మందు అందజేస్తున్నామని మోడీ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. భారత ఆర్మీనే శంకించే విధంగా మాట్లాడుతుందని ఫైరయ్యారు. 23 లక్షల పంజాబీలు పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని వివరించారు.1984 అల్లర్లకు సంబంధించి నిందితులకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని మోడీ మండిపడ్డారు.

Prime Minister Narendra Modi promised a Nava Punjab in his first rally in the poll-bound state.

పంజాబ్ ప్రతీ వీదిలో కొందరు మద్యం షాపు తెరవాలని అనుకుంటున్నారని విమర్శించారు. దీంతో వారి ఇల్లు ఏం కావాలని అడిగారు. అంతేకాదు గత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను అర్థాంతరంగా పదవీ నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించిందని గుర్తుచేశారు. రిమోట్ కంట్రోల్ మాదిరిగా పాలిద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుందని ఆయన ధ్వజమెత్తారు. పంజాబ్ ప్రభుత్వం 2014లో తన హెలికాప్టర్‌ నిలిపివేసిందని మోడీ ఆరోపించారు. పఠాన్ కోట్ వెళ్లాల్సి ఉండగా నిలిపివేసిందని.. ఆ సమయంలో రాహుల్ గాంధీ వెళుతున్నందున.. తనను ఆపివేశారని తెలిపారు.

పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. కానీ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది. ఇవాళ యూపీ రెండో విడత, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+