శ్వేత సౌధంలో ప్రధానికి అరుదైన ఆతిథ్యం - విందుకు హాజరైన దిగ్గజాలు..!!
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి శ్వేత సౌధంలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగించిన ప్రధాని ఆ తరువాత బైడెన్ దంపతులు ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్ కు హాజరయ్యారు. రెండు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అమెరికాలో అడుగు పెట్టిన సమయం నుంచి ప్రధాని మోదీకి అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది. అధ్యక్షుడు బైడెన్ తో పలు ఇప్పందాలు జరిగాయి. బైడెన్ దంపతులకు మోదీ భారతీయ సంప్రదాయ కానుకలిచ్చారు.
#WATCH | Washington, DC: State Dinner underway at the White House. pic.twitter.com/lrdpBZ1so5
— ANI (@ANI) June 23, 2023
ప్రధానికి ప్రత్యేక గుర్తింపు
ప్రధాని మోదీ పర్యటనలో మరో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. గురువారం రాత్రి స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేసారు. చిరుధాన్యాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం తెచ్చేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్ జై కొట్టారు. స్టేట్ డిన్నర మెనూలో చిరుధాన్యాల వంటకాలను ఏర్పాటు చేసారు. బైడెన్ దంపతులు భారత ప్రధానికి ఇచ్చిన విందులో మోదీకి ఇష్టమైన వంటలకాలకు అమెరికన్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు.

వైట్ హౌస్ చెఫ్ నైనా కర్టిస్ మోదీ విందు కోసం వివిధ రకాల డిషెస్ వండారు. మోదీ పూర్తి స్థాయి వెజెటేరియన్. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వంటల మెనూ తయారు చేసినట్లు నైనా కర్టిస్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడి భార్య జిల్ బైడెన్ మోదీ కోసం ప్రత్యేకంగా మేరినేటెడ్ మిల్లెట్స్‌ను డిన్నర్‌లో మోదీకి అందించారు.
స్టేట్ డిన్నర్ లో ప్రముఖులు
ప్రధాని మోదీతో పాటుగా పలువురు భారతీయ పారిశ్రామిక దిగ్గజాలు..అధికార ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు. భారతీయ సంతతికి చెందిన సుందర్ పిచయ్, సత్య నాదెళ్ల, ముఖేష్ అంబానీ దంపతులు, ఆనంద్ మహీంద్ర, ఇంద్రనూయి, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తో పాటుగా కేంద్ర మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ తో పాటుగా అమెరికాలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ఇతర దేశాల ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
రెండు దేశాలకు చెందిన పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్టేట్ డిన్నర్ లో కలిసి పాల్గొనటం అరుదైన ఘట్టంగా పేర్కొంటున్నారు. జిల్ బైడెన్ ప్రత్యేకంగా సిద్దం చేయించిన వంటకాలతో అతిధులకు విందు ఇచ్చారు.
US President, First Lady Jill Biden welcome PM Modi at White House for State dinner, guests include several big-wigs
— ANI Digital (@ani_digital) June 22, 2023
Read @ANI Story | https://t.co/2hvvNlkXqP#PMModiUSVisit #US #JoeBiden #WashingtonDC pic.twitter.com/WwCGIHWAhP
ప్రత్యేక సందర్శంగా పేర్కొన్న ప్రధాని
తనకు స్టేట్ డిన్నర్ తో ఆతిథ్యం ఇచ్చిన జో బైడెన్ కు ప్రధాని ధన్యవాదాలు చెప్పారు. తన పర్యటన ఫలప్రదం అయ్యేందుకు సహకరించిన జిల్ బైడెన్ కు ప్రత్యేకంగా థాంక్స్ అంటూ ప్రధాని పేర్కొన్నారు. తన కోసం శ్వేత సౌధం ద్వారాలు తెరిచారని చెప్పుకొచ్చారు. రెండు దేశాలకు చెందిన ప్రముఖులతో కలవటం ప్రత్యక సందర్భంగా ప్రధాని అభివర్ణించారు.
జపాన్ లో జరిగిన క్వాడ్ సమావేశం లో బైడెన్ తో నాడు సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రవాస భారతీయులకు శ్వేత సౌధం లోపలకు ఆహ్వానించారు. అధ్యక్షుడు బైడెన్ తో జరిగిచన చర్చలు..ఒప్పందాల్లో భాగంగా రక్షణ శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications