మైసూరులో రోడ్డు ప్రమాదానికి గురైన ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ కుటుంబం
మైసూరులో రోడ్డు ప్రమాదానికి గురైన ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ కుటుంబం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. మైసూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ, ఆయన కుమారుడు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో ప్రహ్లాద్ మోడీ, ఆయన భార్య, కొడుకు, కోడలు ఉన్నట్టు తెలుస్తోంది. మోడీ కుటుంబం మైసూరు నుంచి చామరాజనగర, బండిపురాకు కారులో వెళుతుండగా.. కడకోల సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రహ్లాద్ మోడీ, ఆయన కుమారుడు, కోడల్ని చికిత్స కోసం ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రహ్లాద్ మోడీ (70), ఆయన కుమారుడు మెహుల్ ప్రహ్లాద్ మోడీ (40), కోడలు జిందాల్ మోడీ (35), మనవడు మెహత్ మెహుల్ మోడీ (6), డ్రైవర్ సత్యనారాయణ చాలక (46) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మైసూరు నుంచి బందీపూర్ వెళుతుండగా ప్రమాదం జరిగిందని, ప్రహ్లాద్ మోడీ ముఖంపై, మనవడు మెహత్ కాలికి గాయమైందని, అందరికీ స్వల్ప గాయాలే కావడంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చికిత్స పొందుతున్న జేఎస్ఎస్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ మధు చెప్పినట్టు కన్నడ మీడియా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ చిన్న తమ్ముడైన ప్రహ్లాద్ మోడీ.. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు












Click it and Unblock the Notifications