అందరు కార్యకర్తల్లా.. ప్రధాని మోడీ స్వయంగా భోజనం తెచ్చుకున్నారు

బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వెంట లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. పార్టీ సహచరులతో కలిసి కూర్చొని భోజనం చేశారు.

న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వెంట లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. పార్టీ సహచరులతో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాన్ని బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

PM Modi Brought His Own Lunch To Meeting, 'Such Equality' Tweets BJP

ఈ ఆసక్తికర సన్నివేశం ప్రధాని మోడీ లోకసభ నియోజకవర్గం వారణాసిలో చోటుచేసుకుంది. కార్యకర్తల సమావేశానికి వచ్చిన మోడీ తన భోజనాన్ని తానే స్వయంగా తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలతో కలిసి తినడం గమనార్హం.

కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న ఓ ఫొటోను బీజేపీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ.. సమానత్వం బీజేపీ ఒక్కదానితో మాత్రమే సాధ్యమని పేర్కొంది. వారణాసిలో గురువారం మోడీ 26 వేల మంది బూత్‌ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+