వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే ఆయన కుటుంబం: మోడీ దీపావళి వేడుకలు.. వరుసగా నాలుగే ఏడాదీ సైనికులతోనే...

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి వేడుకలను వరుసగా నాలుగో ఏడాది సైనికులతో కలిసి జరుపుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురేజ్‌ సెక్టార్‌ వద్ద పహారా కాస్తున్న సైనికులను మోడీ కలుసుకొని దీపావళి వ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

PM Modi Celebrates Diwali With Jawans సైనికులతో మోదీ దీపావళి | Oneindia Telugu

బందిపొరా: ఎవరన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి 'కుటుంబం' లేదని? వరుసగా నాలుగో ఏడాది కూడా ఆయన దీపావళి వేడుకలను తన కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.

ఇంతకీ ఆయన కుటుంబం ఎవరో తెలుసా? వరుసగా నాలుగో ఏడాది సైనికులతో కలిసి జరుపుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురేజ్‌ సెక్టార్‌ వద్ద పహారా కాస్తున్న సైనికులను మోడీ కలుసుకొని దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

అక్కడి నుంచి ఆయన ఉరీ సెక్టార్‌లో కూడా పర్యటించారు. మోడీ వెంట.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవ్‌రాజ్‌ అన్బు తదితరులు ఉన్నారు.

PM Modi Celebrates Diwali With Soldiers - 'His Family' - In Kashmir

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోడీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసే జరుపుకొంటున్నారు. 2014లో సియాచిన్‌లో సైనికులతో జరుపుకోగా.. 2015లో అమృత్‌సర్‌లోని డొగ్రాయ్‌ వార్‌ మెమోరియల్‌ను సందర్శించి అక్కడ జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

ఇక గతేడాది ప్రధాని మోడీ దీపావళి వేడుకలను ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) సిబ్బందితో కలిసి చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆయన ఉత్తరఖాండ్‌లోని చమోలి వెళ్లి.. అక్కడ ఐటీబీపీ జవాన్లను కలిశారు. వారికి మిఠాయిలు తినిపించి ఆనందంగా వేడుకలు చేసుకున్నారు.

సరిహద్దుల్లో ఘనంగా...

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. అటారీ వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్‌ రేంజర్లకు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మిఠాయిలు అందజేశారు. భారత జవాన్లకు పాక్‌ రేంజర్లు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

అమ‌ర జ‌వాన్ల కోసం...

దేశవ్యాప్తంగా దీపావళి పండగ జరుపుకుంటున్నా కటక్‌లోని ఖాన్‌నగర్‌ ప్రాంతంలో గల శ్మశానవాటికలో ఏటా జరిగే దీపావళి పండగ భిన్నంగా నిలుస్తుంది. ఇక్కడ స్వర్గధామం సేవాసమితి ఆధ్వర్యంలో ఏటా దీపావళికి ముందురోజు రాత్రే దీపావళి నిర్వహిస్తారు.

శ్మశానవాటికలో ఉన్న భవనాన్ని అందంగా ప్రమిదలతో అలంకరిస్తారు. నగరంలో ప్రముఖులు శ్మశానానికి చేరుకుని.. దేశ రక్షణలో అసువులు బాసిన అమర జవాన్లను స్మరించుకుంటూ, వారికి ఆత్మశాంతి కోరుతూ వెయ్యి దీపాలు వెలిగిస్తారు.

English summary
Prime Minister Narendra Modi today spent his fourth Diwali with soldiers - this time at Gurez in Jammu and Kashmir, where troops of the 15 Corps are stationed. During the two-hour tour in Gurez -- a picturesque valley along the Line of Control in Bandipora district - Prime Minister said like everyone else, he was spending the festival with his "family". Exchanging greetings and offering sweets to the soldiers, the Prime Minister said he gets fresh energy when he spends time among the jawans of the Armed Forces. He said he appreciated their penance and sacrifice amid the harsh conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X