కార్గిల్ సరిహద్దుల్లో ప్రధాని మోదీ - భారత్ మాతాకీ జై నినాదాలతో..!!
ప్రధాని మోదీ కార్గిల్ చేరుకున్నారు. దీపావళి పర్విదినాన ప్రధాని మోదీ ఇలా దేశ సరిహద్దల్లో చేరుకోవటం ఆసక్తి కరంగా మారింది. ప్రతీ ఏటా సైనికులతో దీపావళి వేడుకలను ప్రధాని మోదీ జరుపుకోవటం ఆనవాయితీ. సైనికులతో కలిసి జరుపుకునేందుకు ప్రధాని మోదీ కార్గిల్ చేరుకున్నారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎనిమిదేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. కార్గిల్‌లో అడుగు పెట్టిన ప్రధాని సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. దేశం అనేక సవాళ్లను ఎదుర్కొని గట్టిగా నిలబడిందని ప్రధాని అన్నారు.
సైనికుల త్యాగాలను ప్రశంసించారు. దేశరక్షణలో సైన్యం సేవలు మరువలేనివని కొనియాడారు. దేశభక్తి దైవభక్తితో సమానమని తెలిపారు. ఆదివారం అయోధ్యలో జరిగిన దీపావళి దీపోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆకాక్షించారు. ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ స్వీట్లు పంచారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని చెప్పారు.

సైనికుల వల్లే దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని.. ఆర్మీ బలగాలను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ప్రతీ ఏటా జవాన్లతో కలిసి దీపావళి జరుపుకుంటున్న ప్రధాని గతేడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని సైనికులతో కలిసి జరపుకోగా, ఈ సారి కార్గిల్ లో ఆవేడుకలు జరుపుకుంటున్నారు. దీపావళి పర్వదినం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరూ కుటుంబం, స్నేహితులతో కలిసి అద్భుతమైన దీపావళిని జరుపుకోవాలని ఆశిస్తున్నానని తన సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi participates in 'Vande Mataram' singalong with members of the Armed Forces, in Kargil pic.twitter.com/txvve7pN4u
— ANI (@ANI) October 24, 2022
#WATCH | 'Vande Mataram' & 'Bharat Mata Ki Jai' slogans chanted by members of the Armed Forces, as Prime Minister Narendra Modi joined them for #Diwali celebrations in Kargil pic.twitter.com/WvtM01PEbI
— ANI (@ANI) October 24, 2022












Click it and Unblock the Notifications