స్మృతి ఇరానీకి ప్రధాని నరేంద్ర మోడీ మరో షాక్!

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ)లో తాజాగా మార్పులు చేర్పులు జరిగాయి. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని తప్పించి ప్రకాశ్ జవదేకర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ అవకాశం కల్పించారు. కొద్ది రోజుల క్రితం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో స్మృతికి షాక్ తగిలిన విషయం తెలిసిందే.

స్మృతిఇరానీ శాఖ మార్పు వెనుక అసలు కారణం ఇది

ఆమె వద్ద నున్న హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను జవదేకర్‌కు అప్పగించారు. ఇప్పుడు సీసీపీఏలో స్మృతిని తప్పించి, జవదేకర్‌కు చోటు కల్పించారు. జవదేకర్ ఇంతకుముందు కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండేవారు.

Smriti Irani

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని సిసిపిఏలో ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులుగా సహా 11 మంది ఉంటారు. మార్పులు చేర్పుల అనంతరం కమిటీ జాబితాను విడుదల చేశారు. ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన నజ్మా హెఫ్తుల్లా కమిటీలో స్థానం కోల్పోయారు.

స్మృతి ఇరానీకి మరో ఎదురుదెబ్బ!: ప్రధాని మోడీ తిరస్కరణ

న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌కు స్థానం దక్కింది. రాజీవ్ ప్రతాప్ రూడీ స్థానంలో పార్లమెంటరీ వ్యవహారాల సాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఎస్ అహ్లువాలియాకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం కల్పించారు.

న్ాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, ముక్తార్ అబ్బాస్ నక్వీలకు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం దక్కింది. ఇతర సభ్యులుగా కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రామ్ విలాస్ పాశ్వాన్, అనంత్ కుమార్‌లు ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Modi Changes All 6 Cabinet Committees, No Place For Smriti Irani.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి