అందుకే ట్రంప్ పిలిచినా వెళ్లలేదు: తేల్చేసిన ప్రధాని మోదీ
ఇటీవల కెనడాలో జరిగిన జీ-7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయితే ఈ సమయంలోనే ప్రధాని మోదీని అమెరికాకు ఆహ్వానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ తిరస్కరించారు. అమెరికా వెళ్లకుండానే భారత్ కు తిరిగి వచ్చేశారు. అయితే తాజాగా అందుకు గల కారణాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు. తాను ఎందుకు ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించానో వివరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒడిషాలోని భువనేశ్వర్ లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ అందుకు గల కారణాన్ని వెల్లడించారు. జగన్నాథుడి పుణ్యభూమి అయిన ఒడిషాకు వెళ్లడమే తనకు ముఖ్యమని.. అందుకే ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని సంతోషం వ్యక్తం చేశారు.

" నేను జీ-7 సమ్మిట్ లో భాగంగా కెనడా వెళ్లాను. అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నన్ను అమెరికాకు ఆహ్వానించారు. విందులో పాల్గొనాలని అన్నారు. నేను వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేను పూరీ జగన్నాథ్ పుణ్యసన్నిథి అయిన ఒడిషాకు వెళ్లాలి అని చెప్పాను. నేను సున్నితంగా ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించాను" అని మోదీ తెలిపారు.
ପେଟ୍ରୋ କେମିକାଲ୍ସ ଠାରୁ ଆରମ୍ଭ କରି ବୟନଶିଳ୍ପ ପର୍ଯ୍ୟନ୍ତ ଓଡ଼ିଶାକୁ ଏକ ବଡ଼ ଶିଳ୍ପ ରାଜ୍ୟ ରୂପରେ ପ୍ରତିଷ୍ଠା କରିବା ଦିଗରେ ଆମେ ନିରନ୍ତର ପ୍ରୟାସ କରୁଛୁ । pic.twitter.com/Ln4HDUeA8K
— Narendra Modi (@narendramodi) June 20, 2025
ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఒడిషాలో రూ. 18,600 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఒడిషాలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందన్నారు. అప్పటి ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆ విషయంలో గత సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని తెలిపారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు.












Click it and Unblock the Notifications