PM Modi: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని మోడీ

PM Modi: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 241 మంది ప్రయాణికులలో ఒకరైన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని శుక్రవారం ప్రధాన నరేంద్ర మోడీ కలిశారు. వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీజేపీ నాయకుడికి నివాళులర్పిస్తూ.. మాజీ సీఎం నిరాడంబరమైన, కష్టపడే వ్యక్తి అని, పార్టీ సిద్ధాంతానికి గట్టిగా కట్టుబడి ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు.

"విజయ్‌భాయ్ రూపానీ జీ కుటుంబాన్ని కలిశాను. విజయ్‌భాయ్ మన మధ్య లేరని ఊహించడం కూడా కష్టం. నాకు ఆయన దశాబ్దాలుగా తెలుసు. అత్యంత సవాలుతో కూడిన సమయాలలో కూడా మేము భుజం భుజం కలిపి పనిచేశాం. విజయ్‌భాయ్ నిరాడంబరమైన, కష్టపడే వ్యక్తి, పార్టీ సిద్ధాంతానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు. పదవులు అధిరోహిస్తూ ఆయన పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా శ్రద్ధగా సేవలందించారు." అని ప్రధాని మోడీ ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు.

PM Modi Condoles Family of Former Gujarat CM Vijay Rupani

"అప్పగించిన ప్రతి పాత్రలో, రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో, రాజ్యసభ ఎంపీగా, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. విజయ్‌భాయ్ గుజరాత్ సీఎం‌గా ఉన్నప్పుడు నేను ఆయనతో విస్తృతంగా పనిచేశాను. ఆయన గుజరాత్ వృద్ధి పథాన్ని, ముఖ్యంగా జీవన సౌలభ్యాన్ని పెంచే అనేక చర్యలను తీసుకువచ్చారు. మా మధ్య జరిగిన సంభాషణలను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి " అని ప్రధాని మోడీ అన్నారు.

గురువారం అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మరణించారు. దివంగత విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి ఆమెను ఆహ్వానించారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా అహ్మదాబాద్ చేరుకుని గురువారం సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు.

కూలిపోయిన ఎయిరిండియా విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్రువీకరించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఎయిరిండియా నిర్ధారించిన ప్రకారం.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 12 మంది సిబ్బందితో సహా మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడడంతో అందులో ఉన్న మెడికల్, నర్సింగ్ విద్యార్థులు 24 మంది మృతి చెందారు. మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+