ఆర్మీ వాహనం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీర సైనికుల సేవలు భారత్ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఎమోషనల్ పోస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లా ఖన్నీ టాప్ వద్ద ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలో పడింది. దాదాపు 200 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు సైనికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన సైనికులకు ఉదంపూర్ మిలిటరీ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Deeply anguished by the mishap in Doda, in which we have lost our brave army personnel. Their service to the nation will be remembered forever. May the injured recover at the earliest. All possible support is being provided to those affected.
— Narendra Modi (@narendramodi) January 22, 2026
అయితే తాజాగా దోడాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ ప్రమాదంలో మన ధైర్యవంతమైన సైన్యాన్ని కోల్పోయామని తెలిపారు. వారి సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. గాయపడిన వారికి అన్ని రకాలుగా సేవలు చేస్తామని ట్వీట్ చేశారు.

ఇక ప్రమాద సమయంలో వాహనంలో 17 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రోడ్డును అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications