ప్రధాని మోదీ దీపావళి కానుక రూ.8 వేలు.. వాట్సప్ మెసేజ్ వచ్చిందా?

దీపావళి పండుగను కూడా సైబర్ నేరగాళ్ళు తమ మోసాలకు వాడుకుంటున్నారు. దీపావళి పండుగ సమయంలో ప్రజల్లో ఉత్సాహం పెరిగినప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త పన్నాగాలతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం పేరుతో ఫేక్ సందేశాలు పంపిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.వాట్సాప్‌లో చాలా మందికి ఇలాంటి సందేశాలు వస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి కానుకగా ప్రతి పౌరుడికి రూ.8,000 నగదు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పొందాలంటే కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి" అని. కొన్ని సందేశాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే నకిలీ వెబ్‌సైట్ తెరుచుకుంటుంది. అక్కడ పేరు, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ అడుగుతారు. ఒక్కసారి ఆ వివరాలు ఇచ్చేస్తే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

PM Modi Diwali Gift of Rs 8 000 Beware Cyber Fraudsters Spreading Fake WhatsApp Messages as modi diwali gift

తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ విషయంపై స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పిన ప్రకారం, పండుగ సమయంలో ప్రజలు ఉచితాలు, కానుకల పట్ల సులభంగా ఆకర్షితులవుతారని సైబర్ నేరగాళ్లు ఈ బలహీనతను ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి సందేశాలు పూర్తిగా నకిలీవని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాధారణ దీపావళి నగదు కానుకను అందరికీ ఇస్తున్నట్లు ప్రకటన చేయలేదని తెలిపారు.

అనుమానాస్పద లింకులపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఓటీపీ, యూపీఐ పిన్, పాస్‌వర్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ ఇవ్వవద్దు. ఏదైనా ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్లు, ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, లేదా విశ్వసనీయ వార్తా మాధ్యమాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ఎవరైనా వ్యక్తిగత వివరాలు ఇవ్వమని అడిగితే, డబ్బులు కట్టమంటే అది మోసమే అని అర్థం చేసుకోవాలన్నారు.

తెలంగాణాలో పెట్టుబడులు పెడితే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు: సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణాలో పెట్టుబడులు పెడితే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు: సీఎం రేవంత్ రెడ్డి!

ఒకసారి లింక్‌పై క్లిక్ చేసి వివరాలు ఇచ్చేస్తే డబ్బు పోవడమే కాకుండా, మొబైల్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యి మరిన్ని సమస్యలు రావచ్చు.మీకు ఇలాంటి సందేశం వస్తే ఏం చేయాలి?
వెంటనే తొలగించండి. ఫార్వర్డ్ చేయవద్దు. లింక్‌పై క్లిక్ చేయకూడదు. ఒకవేళ అప్పటికే క్లిక్ చేసి ఉంటే వెంటనే బ్యాంకును సంప్రదించి ఖాతాను లాక్ చేయించుకోండి. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+