అమ్మ హీరాబెన్ మోడీ అసామాన్య మహిళ.. ప్రధాని మోడీ మనసులోని భావోద్వేగం!!

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ నేడు మృతిచెందారు. ప్రధాని నరేంద్ర మోడీకి, ఆయన తల్లితో చాలా గొప్ప అనుబంధం ఉంది. మోడీకి తన తల్లి పట్ల ఎంత ప్రేమ ఉంది? కఠినమైన పరిస్థితులలో తల్లి కుటుంబం కోసం ఏవిధంగా నిలబడింది? తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో తన తల్లి పాత్ర ఏమిటి? వంటి అనేక విషయాలను ఆయన 2022 జూన్ 18వ తేదీన హీరాబెన్ మోడీ 100వ పుట్టినరోజు సందర్భంగా చెప్పారు. అమ్మ పైన ఆయన భావోద్వేగాన్ని వెల్లడించారు. ప్రస్తుతం మాతృవియోగం తో బాధపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి తల్లి తో ఉన్న అనుబంధాన్ని ఆయన మాటల్లోనే చెప్పిన విషయాలను చూస్తే..

అమ్మ సాధారణంగా కనిపించినా అసాధారణ మహిళ

అమ్మ సాధారణంగా కనిపించినా అసాధారణ మహిళ

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ వంద సంవత్సరాల పుట్టిన రోజు వేడుక సందర్భంగా తన మనస్సులోని భావాలను ఆవిష్కరించిన ప్రధాని మోడీ అమ్మ అన్నది ఒక పదం కాదు.. ఎన్నో భావోద్వేగాల సంగ్రహం అంటూ పేర్కొన్నారు. తన తల్లి నూరవ పుట్టిన రోజు సందర్భంగా తనకు జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ తన మనసులోని ఆలోచనలను ప్రధాని మోడీ తన బ్లాగ్ లో రాసుకున్నారు. తన అమ్మ సాధారణంగా కనిపించినప్పటికీ ఆమె అసాధారణమైన మహిళ అని, చాలా చిన్న వయసులోనే తన తల్లి ఆమె మాతృమూర్తిని కోల్పోయిందని, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిందని, అయినప్పటికీ బలంగా నిలబడిందని పేర్కొన్నారు.

ఎన్నో త్యాగాలను చేసిన, కష్టాలను ఎదుర్కొన్న మాతృ మూర్తి

ఎన్నో త్యాగాలను చేసిన, కష్టాలను ఎదుర్కొన్న మాతృ మూర్తి

తన పెరుగుదల కోసం , ఎదుగుదల కోసం తల్లి ఎన్నో త్యాగాలను చేసిందని మోడీ వెల్లడించారు. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి, తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రేరణ నిచ్చింది తన తల్లేనని మోడీ తెలిపారు. తన చిన్ననాడు తన తల్లి పడిన కష్టాలని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మోడీ అమ్మ ఇంట్లో పనులన్నీ తాను ఒక్కతే చేసుకునేదని, ఇంటి పోషణ కోసం కూడా తమ వంతు కష్టపడేది అని, వేరే వాళ్ల ఇళ్లల్లో వంటపాత్రలు కడిగి, చరఖా తిప్పి వచ్చిన ఆదాయంతో కుటుంబ ఖర్చులకు మద్దతుగా నిలిచేదని మోడీ తెలిపారు.

ఇప్పుడు కూడా సాధారణ జీవితం గడుపుతున్న గొప్ప వ్యక్తిత్వం ఆమెది

ఇప్పుడు కూడా సాధారణ జీవితం గడుపుతున్న గొప్ప వ్యక్తిత్వం ఆమెది


వర్షానికి ఇల్లంతా కురిసినా, వర్షం నీరు పడుతున్న చోట బకెట్లు, గిన్నెలు పెట్టేదని, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తన తల్లి ఎంతో దృఢంగా నిలిచిందని మోడీ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే వారని తెలిపారు. అమ్మ పేరుతో ఎటువంటి ఆస్తులు లేవు అని, బంగారు ఆభరణాలు ఆమె ధరించింది తాను చూడలేదని, ఆమెకు ఆసక్తి కూడా ఉండేది కాదని పేర్కొన్న మోడీ ప్రస్తుతం కూడా గతంలో మాదిరి అతి సాధారణ జీవితాన్ని, ఒక చిన్న గదిలో కొనసాగిస్తున్నారని తెలిపారు.

అమ్మతో అనుబంధాన్ని పంచుకున్న ప్రధాని మోడీ

అమ్మతో అనుబంధాన్ని పంచుకున్న ప్రధాని మోడీ

అమ్మతో కలిసి బయటకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువని పేర్కొన్న మోడీ , 2001లో తను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో తన వెంట తన అమ్మ హీరాబెన్ మోడీ ఉందని ప్రధాని తల్లికి సంబంధించిన, తన తల్లితో తనకున్న అనుబంధాన్ని, ఆమె వద్ద నేర్చుకున్న అనేక మంచి విషయాలను తన బ్లాగ్లో పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+